Sreemukhi:శ్రీముఖికి బాలీవుడ్ బంపరాఫర్.. త్వరలో ఆ స్టార్ హీరో సినిమాతో హిందీలో పాగా..
శ్రీముఖి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ప్రేక్షకులను మనసులను దోచుకుంది.
అంతేకాదు యాంకర్‌గా తన కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అలరిస్తోంది.
శ్రీముఖి వీలు చిక్కినపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది. అంతేకాదు టీవీ యాంకర్ గా ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే సైడ్ క్యారెక్టర్స్ తో సత్తా చూపెడుతోంది శ్రీముఖి.
అప్పట్లో నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.
గతేడాది చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ మూవీలో శ్రీముఖి ప్రముఖ పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
తాజాగా ఈమె ప్రముఖ బాలీవుడ్ అగ్ర హీరో నటిస్తున్న సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.