Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..

Tue, 16 Apr 2024-10:40 am,

రాముడితో తెలుగు సినిమాలకు మంచి అనుబంధమే ఉంది. రామాయణం నేపథ్యలో తెలుగులో తెరకెక్కిన చిత్రాల చాలానే ఉన్నాయి. తెలుగు సినిమాలు పౌరాణికాలతో ప్రారంభమైంది.

శ్రీరామ పాదుకా పట్టాభిషేకం'

శ్రీరామకథతో తెలుగులో వచ్చిన ఫస్ట్ మూవీ 'శ్రీరామ పాదుకా పట్టాభిషేకం'. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ ఫస్ట్ టైమ్ రాములోరి పాత్రలో అలరించారు.

లవకుశ

తెలుగులో ఎవర్ గ్రీన్ పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ 'లవకుశ' ఒకటి. సి.పుల్లయ్య, సి.ఎస్.రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రామాయణంలోని ఉత్తర కాండ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

 

సంపూర్ణ రామాయణం (NTR) ఎన్టీఆర్ హీరోగా తమిళంలో తెరకెక్కిన సినిమా 'సంపూర్ణ రామాయణం'. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు.

 

సీతారామ జననం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన తొలి చిత్రం 'సీతారామజననం'. ఏఎన్నార్ నట జీవితం రాముడిగా ప్రారంభం కావడం విశేషం.

సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామారావు రావణ బ్రహ్మ పాత్రలో నటించారు. ఈ సినిమాలో వచ్చే సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.

వీరాంజయ కాంతారావు తెలుగు సినిమా తొలి తరం హీరోల్లో ఒకరు. ఈయన శ్రీరామచంద్రుడిగా వీరాంజనేయ సినిమాలో నటించారు.

బాపు సంపూర్ణ రామాయణం.. శోభన్ బాబు, చంద్రకళ సీతారామ చంద్రులుగా నటించిన సినిమా 'సంపూర్ణ రామాయణం'. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఎన్టీఆర్ తర్వాత శ్రీరాముడి పాత్రలో మెప్పించిన ఘనత శోభన్ బాబుకే దక్కుతోంది.

సీతా కళ్యాణం.. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన మరో రామాయణ దృశ్యకావ్యం 'సీతా కళ్యాణం'. జయప్రద సీత పాత్రలో నటించిన  ఈసినిమాలో రవి శ్రీరామచంద్రుడి పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా తెలుగులో మంచి విజయమే సాధించింది.

రామాయణం.. గుణ శేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'రామాయణం'. అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది.

శ్రీరామరాజ్యం బాపు చివరి సారి దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీరామరాజ్యం'. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది.

ఆదిపురుష్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఆదిపురుష్' . రామాయణాన్ని పూర్తిగా వక్రీకరంచి ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link