Tiruchanur: తిరుచానూరు అమ్మవారికి శ్రీవారి కానుకలు.. 3 కిలోల బంగారం, వజ్రా భరణాలు చూడండి..
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతుంది. చివరి రోజు అయిన శుక్రవారం రోజున తిరుమల శ్రీ వేంకటేశుని తరఫు నుంచి అమ్మవారికి భారీగా కానుకలు వెళ్లాయి.
ఈరోజు చక్రస్నానం కూడా వైభవంగా జరిగింది పద్మ పుష్కరిణిలో అంగరంగ వైభవంగా సాగించారు. అంతేకాదు మాడ వీధుల్లో పద్మావతి అమ్మవారిని పల్లకిలో ఊరేగించి ఆ భక్తులకు కనువిందు చేశారు.
ఆ తర్వాత తిరుమంజాసనం కూడా నిర్వహించారు. అమ్మవారి అలంకరణలో ముఖ్యంగా వివిధ రకాల పండ్లు పూలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు పద్మావతి ఆలయంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించారు.
ఇక నిన్న శుక్రవారం చివరి రోజు అయిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా టిటిడి ఈవో శ్యామల రావు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు భక్తుల కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అన్న ప్రసాదాలు, తాగునీరు అందించామని చెప్పారు.
శ్రీవారి తరఫు నుంచి పద్మావతి అమ్మవారికి దాదాపు మూడు కేజీల బంగారు వజ్రా భరణాలు వెళ్లాయి. ఇందులో పాండియన్ కిరీటం, లక్ష్మీ పెండెంట్, డైమండ్ నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు వీటి విలువ దాదాపు కోటి పైనే ఉంటుందని అంచనా..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఆ భక్తులకు అన్నప్రసాదనాలు అందించారు. అన్నం, పప్పు, సాంబార్ తో పాటు స్వీట్లు కూడా వితరణ చేశారు.