Sruthi Haasan: 90 రెట్రో లుక్ లో అదరగొట్టిన శృతిహాసన్.. చాలా డిఫరెంట్ గా!

Fri, 05 Jul 2024-10:30 pm,

కమల్ హాసన్, వెంకటేష్ కలిసి నటించిన ఈనాడు సినిమా ప్రమోషన్స్ పాటలో ముందుగా కనిపించింది శృతిహాసన్. సింగర్ గా పరిచయమైన.. ఈ హీరోయిన్ అప్పట్లో అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత సిద్ధార్థ తో అనగనగా ఒకదీరుదు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

ఈ సినిమా విజయం సాధించకపోయిన.. శృతిహాసన్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత శృతిహాసన్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే గబ్బర్ సింగ్ సినిమా శృతిహాసన్.. పాపులారిటీ మార్చేసింది. 

గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. శృతిహాసన్ కి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ తెలుగులో ఎప్పుడు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు శృతిహాసన్.. నటించిన చిత్రాలు దాదాపు విజయాలు సాధించినవే.  

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది శృతిహాసన్. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో కనిపించి ఆకట్టుకుంది. ఈ మధ్యనే సలార్ చిత్రం లో మెరిసింది ఈ భామ. త్వరలో దేఖాయిత్.. సలార్ 2 సినిమాలలో కనిపించనుంది.  

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన..ఫోటోలు వైరల్ అవుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రెట్రో లుక్ తో ఈ హీరోయిన్ కనిపించిన ఫోటోలు అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link