Star Kids School : బాలీవుడ్ సూపర్ స్టార్ల పిల్లలు చదివే స్కూల్ ఇదే. ఈ స్కూల్ ఫీజుతో ఓ బెంజ్ కార్ కొనుక్కోవచ్చు..!!

Tue, 13 Aug 2024-9:59 pm,

ఓ వైపు స్కూల్ ఫీజులు ఆకాశాన్ని తాకుతున్నాయని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతుంటే ఓ స్కూల్ ఫీజు మాత్రం చూస్తేనే కళ్ళు తిరిగి పోయేలా పెట్టారు. ఈ స్కూల్లో ఎవరు చదువుతారు తెలిస్తే మీకు దిమ్మతిరిగి పోవాల్సిందే సూపర్ స్టార్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ కూడా ఈ స్కూల్ విద్యార్థి. ఇక దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టిన జాన్వికపూర్ కూడా ఈ స్కూల్ విద్యార్థి అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక అమితాబచ్చన్ మనవరాలు, ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ఇదే స్కూల్లో చదువుతోంది. మరి ఇంత మంది స్టార్ కిడ్స్ చదువుతున్న స్కూల్ ఏంటా అని మీరు ఆలోచిస్తున్నారా..ఇప్పుడు తెలుసుకుందాం అదే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్.  

మరి అదీ అసలు సంగతి రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ పేరిట నెలకొల్పిన ఈ స్కూలును ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నడుపుతున్నారు. ఈ స్కూల్ మొత్తం 1,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే హై క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ స్కూల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్కూల్లో ఫీజు విషయానికి వస్తే ఏటా అక్షరాల రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇక ఫీజు తో పాటు ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయి. విద్యార్థులను ఫారెన్ ట్రిప్పులకు కూడా తీసుకెళ్తారు. ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ సిలబస్ అయిన ఐబి కారిక్యులం ద్వారా బోధన చేస్తారు. 2003లో స్థాపించిన ఈ స్కూల్ రిలయన్స్ గ్రూప్ ద్వారా నడుపుతోంది.   

ఈ స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివితే మొత్తం ఫీజు ఖర్చు దాదాపు కోటి రూపాయలు పైనే అవుతుంది. ఈ స్కూల్ విశిష్టత కొస్తే మొత్తం 2.3 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉంది. ఇందులో ఒక మల్టీమీడియా ఆడిటోరియం, ఆర్ట్ రూమ్, లెర్నింగ్ సెంటర్, యోగ రూమ్, అలాగే పర్ఫామెన్స్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి సెంటర్ ఉన్నాయి.    

ఇక ఈ స్కూల్లో లైబ్రరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం 40 వేల వాల్యూమ్స్ పుస్తకాలు ఇందులో ఉన్నాయి. వీటిలో మ్యాగజైన్స్, ఆడియో విజువల్ మెటీరియల్, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.  

ఇక అలాగే స్కూల్లో పూర్తిస్థాయిలో మెడికల్ సెంటర్ ఉంది. ఇందులో డాక్టర్లు క్వాలిఫైడ్ నర్సులు అందుబాటులో ఉంటారు. పిల్లల కోసం రెండు విశాలమైన డైనింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. వీటిలో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అలాగే లంచ్ కూడా ఇక్కడే అందిస్తారు. ఈ వంటకాలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 5 స్టార్ హోటల్ చెఫ్స్ వీటిని తయారు చేస్తారు. 

ఇక చదువుతోపాటు ఆర్ట్, వెస్ట్రన్, ఇండియన్ మ్యూజిక్, డాన్స్, థియేటర్ ఆర్ట్స్, యోగా, అథ్లెటిక్స్ వంటి కార్యకలాపాల్లో పిల్లలకు శిక్షణను అందిస్తారు. ఇక ఆటల విషయానికొస్తే బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్, జూడో వంటి ఆటలు పిల్లలకు అందుబాటులో ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link