Student Loan: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.10 లక్షల రుణ మంజూరుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!
విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన వరం ఇచ్చింది. దీంతో ఏకంగా వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల వరకు రుణం మంజూరు అవుతుంది.
విద్యార్థుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు 'విద్యాలక్ష్మి' పథకం కింద రూ.10 లక్షల లోన్ పొందవచ్చు.
ప్రతిఏటా ఈ పథకం కింద 22 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. మంజూరు చేసిన ఈ పది లక్షల లోన్‌లో 75 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు గ్యారెంటీగా ఉండనుంది. అంతేకాదు 3 శాతం వరకు రాయితీ కూడా అందించనుంది.
ఈ పథకం కింద ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.3,600 కోట్లు కేటాయించనుంది. దీంతో ఏ హామీ, తాకట్టు లేకుండానే విద్యార్థులు తమ ఉన్నత చదువుల నిమిత్తం రూ.10 లక్షలు పొందవచ్చు.
విద్యాలక్ష్మి పథకానికి అర్హత సాధించాలంటే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియలో భాగంగా కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాలక్ష్మి పథకం కింద యువతకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుంది.
ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఏ ఆటంకం లేకుండా ఈ పథకం ద్వారా చదువుకోవచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం మెరిట్ పొందిన ప్రభుత్వ, ప్రైవేటు హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో చదువుతున్నవారికి ఆర్థికంగా చేయూత అందించడం.
అంటే ఏ గ్యారెంటీ లేకుండానే పది లక్షల రుణం విద్యార్థులు పొందుతారు. దీంతో వారి కాలేజీ ట్యూషన్ ఫీజు, కోర్సు సంబంధిత ఫీజులు చెల్లించవచ్చు. పీఎం విద్యాలక్ష్మి పథకం ప్రకారం విద్యార్థులు బ్యాంకులకు ఎలాంటి తాకట్టు, గ్యారెంటీ ఇవ్వకుండానే రుణం పొందవచ్చు.
దేశవ్యాప్తంగా టాప్ 100 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో ఉన్న అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. స్టేట్‌కు చెందిన 101-200 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ విద్యాసంస్థలకు కూడా వర్తిస్తుంది.