Summer Heat Stroke: మాడు పగులగొడుతున్న ఎండలు.. వడదెబ్బకు ఆరుగురు బలి..
తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఎండలు మండిపోతున్నాయి. గత పదిహేనేళ్లలో ఎన్నడు లేని విధంగా ఎండలు భగ భగ మండిపోతున్నాయి.ప్రజలు కాళ్లు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో జనాలు మొన్న నలుగురు చనిపోయారు.
ఇక నిన్న మరో ఇద్దరు వడదెబ్బ ప్రభావంతో చనిపోవడం తీవ్ర ఆందోళన కల్లించే అంశంగా మారింది. దీనిపై వాతావరణ కేంద్రం అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతేనే బైటకు వెళ్లాలని కోరుతున్నారు. తెలంగాణలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలో బైటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా.. నీళ్లను ఎక్కువగా తాగాలి. అంతేకాకుండా దాహాం వేసిన వేయకున్న తరచుగా నీళ్లు తాగుతుండాలి. బైటకు వెళ్లినప్పుడు ఫ్రూట్ జ్యూస్ లు, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకుంటు ఉండాలి. ఇలా చేయడం వల్ల కొద్దిగా ఉపశమనం ఉంటుంది.
ఇంట్లో ఉన్న కూడా ఎక్కువగా నిమ్మరసం, ఓఆర్ఎస్ వాటర్ ను ఎక్కువగా తీసుకొవాలి. బాడీ డీహైడ్రేషన్ ప్రభావంకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ఇలాంటి క్రమంలో.. పెద్దవాళ్లు, చిన్న పిల్లలను ఎంతో జాగ్రత్తగా ఉండేలా చూసుకొవాలి. వదులుగా ఉండే దుస్తులు వేసుకొవాలి.
చెమట పట్టడం, గుండె దడ అన్పించడం, తలనొప్పి, వికారం కల్గటం వంటి సింప్టమ్స్ కన్పిస్తే వెంటనే డాక్టర్ లను సంప్రదించాలి. ఇంట్లో ఉన్నప్పుడు చల్లగా ఉండేలా కూలర్ లు,ఏసీలు ప్లాన్ లు చేసుకొవాలి. అంతేకాకుండా.. ఇంట్లో కొన్ని మొక్కలను పెంచితే ఇంటి వాతావరణం చల్లగా ఉంటుంది.