Summer Tourism Tips: వేసవిలో ఈ 6 పర్యాటక ప్రాంతాల సందర్శన నరకమే
డార్జిలింగ్
డార్జిలింగ్ అందమైన లోయలు, పర్వత ప్రాంతాలకు ప్రతీతి. అందుకే పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. అయితే మే-జూన్ నెల డార్జిలింగ్ సందర్శనకు అంత అనువైంది కాదు. భారీ వర్షాలుండవచ్చు మీరు ట్రిప్ ఎంజాయ్ చేయలేరు
రాజస్థాన్
రాజస్థాన్ అంటేనే రాచరికం, వైభవం, చరిత్రకు ప్రతీతి. కానీ వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి ఉంటాయి. దాంతో తిరిగేందుకు ఇబ్బంది ఎదురౌతుంది.
ఆగ్రా
ఆగ్రాలోని తాజ్‌మహల్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పర్యాటక ప్రాంతం. వేసవిలో తిరిగేందుకు అనువుగా ఉంటుంది. భీకరమైన వేడి కారణంగా సందర్శకులకు కష్టమౌతుంది. ట్రిప్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది.
కచ్
దేశంలోని అతి పెద్ద ధార్ ఎడారి ప్రాంతమిది. ఎడారి ప్రాంతాలు దర్శనీయమే అయినా వేసవిలో కానేకాదు వేసవిలో ఇక్కడి వాతావరణం 50 డిగ్రీలకు చేరుతుంటుంది. వడగాల్పులు భయంకరంగా ఉంటాయి.
గోవా
సాధారణంగా చాలామంది వేసవిలో గోవా ట్రిప్ వేస్తుంటారు కానీ ఏప్రిల్-మే నెలల్లో ఇక్కడి వాతావరణం తిరిగేందుకు అంత మంచిదికాదు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కపోత అధికంగా ఉంటుంది.
కాన్హా నేషనల్ పార్క్
పులులకు ప్రసిద్ధి చెందిన కాన్హా నేషనల్ పార్క్ వేసవిలో సందర్శించడం అంత మంచిది కాదు. ఇదొక సఫారీ జంగిల్. వేసవి కాలం కావడంతో ఇవి బయటకు రావు. సో మీ ట్రిప్ వృధా కావచ్చు.