Today Rasi Phalalu: ఈ రాశులవారికి కృషికి తగిన గుర్తింపు లభించడం ఖాయం!!

Sun, 28 Jul 2024-6:56 am,

మేష రాశి: మేషరాశివారికి ఈరోజు ఎంతో ముఖ్యమైనది. గడ్డుకాలం తొలగి అన్ని కలిసి వచ్చే సమయం. శ్రమకు తగ్గినంత ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికి తెలివితేటలతో సమస్యలను పరిష్కరించాలి. కోపం కారణంగా శ్రతువులు పెరుగుతారు. లక్ష్మీదేవి, శివ ఆరాధన చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.  

వృషభ రాశి: ఈరోజు వృషభ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు లాభాలు కలిగే అవకాశం ఉంది.ఏకాగ్రతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.   

మిథున రాశి: ఎదుర్కొనే అన్ని సవాళ్లను అధిగమించడానికి మనోబలం చాలా ముఖ్యం. కొన్ని ముఖ్యమైన విషయాలలో అదృష్టవంతులుగా ఉంటారు. చిన్న చిన్న అవరోధాలను ఎదుర్కొన్నా నిరుత్సాహపడకూడదు. సూర్యనారాయణుడు దర్మించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.   

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి బుధుడు ప్రస్తుతం చాలా శుభ ఫలితాలను అందిస్తున్నాడు. తంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారం కలుగుతుంది. స్థిరాస్తుల విలువ పెరగవచ్చు. కొత్త స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆశయం నెరవేరవచ్చు.  

సింహ రాశి: గతంలో జరిగిన మంచి , చెడు సంఘటనల నుండి పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం గ్రహాల స్థితిగతులు అనుకూలంగా లేనందున ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 

కన్యా రాశి: పదోన్నతి లభించే అవకాశం ఉంది. తెలివితేటలు, కృషి వల్ల వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  మనశ్శాంతితో ఉండటం వల్ల ఇంకా ఎక్కువ సాధించగలరు.  కృషికి తగిన గుర్తింపు లభించడం ఖాయం.

తులా రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలా శుభకరమైన రోజు. మిత్రులు  అండగా ఉంటారు. వారి సహాయ సహకారాలు పొందుతారు. భవిష్యత్తు గురించి ఆలోచించడం, నైపుణ్యాలను పెంచుకోవడం మంచిది.

వృశ్చిక రాశి: ధన లాభం, కోరికలు నెరవేరడం, ఆస్తి సంపద లాంటి అనేక శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే  కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. కొందరి అసూయ  ఇబ్బందులు కలిగించవచ్చు.  మనశ్శాంతి కోసం ధ్యానం చేయండి.

ధనుస్సు రాశి: చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.  ధైర్యం, ఉత్సాహం చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటాయి. కొన్ని పరిస్థితుల్లో సాహసంగా వ్యవహరించాల్సి ఉంటుంది. భయపడకుండా ముందుకు సాగండి.  

మకర రాశి: సకాలంలో పనులు ప్రారంభించండి. మాట‌లు పొదుపుగా వాడ‌టం అవసరం. దురుచూస్తున్న ఒక ముఖ్యమైన విషయంలో విజయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ప్రమోషన్ పొందవచ్చు.  

 కుంభ రాశి: కుంభ రాశి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా  స్పందించాలి. నవగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల మనస్సు శాంతంగా ఉంటుంది.

మీన రాశి: జీవితంలో ప్రస్తుతం చాలా మంచి కాలం నడుస్తోంది. చేపట్టిన పనులు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉంటే ఆదాయం పెరుగుతుంది. సూర్య భగవానుడిని స్మరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link