Mahesh Babu House Pics: మహారాజా భవనాన్ని మించేలా ప్రిన్స్ మహేష్‌ బాబు ఇల్లు.. చూస్తే మైండ్ బ్లోయింగ్..!

Fri, 09 Aug 2024-1:43 pm,

రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా.. పరిచయమయ్యారు మహేష్ బాబు. అంతకుముందే బాలనటుడిగా.. ఎన్నో సినిమాలలో నటించారు. సినిమాల్లోకి అడుగు పెట్టింది సూపర్ స్టార్ కొడుకుగానే అయినా.. అతని నటన వల్ల.. తానే సూపర్ స్టార్ గా ఎదిగారు.  

మహేష్ బాబు నటించిన ఒక్కడు,‌ అతడు,‌ పోకిరి లాంటి సినిమాలు.. అతనికి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్..ని తెచ్చిపెట్టాయి. ఈ మూడు సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ సూపర్ హిట్స్ గా మిగిలాయి. ముఖ్యంగా పోకిరి సినిమా.. మహేష్ బాబుని తెలుగు ఇండస్ట్రీలో.. సూపర్ స్టార్ గా నిలబెట్టింది. 

కాగా మహేష్ బాబు ఈరోజుతో.. 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే వయసు పెరిగిన.. ఈ హీరోకి అందం మాత్రం తగ్గడం లేదని.. అందరూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమా రాజమౌళితో చేయనున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఈ క్రమంలో మహేష్ బాబు ఇంటికి సంబంధించిన ఫోటోలు.. ఆయన బర్త్డే సందర్భంగా వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు ఇల్లు చూడడానికి ఇంద్ర భవనంలా కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. జూబ్లీహిల్స్ లో ఉన్న ఈ ఇల్లు ఖరీదు.. అక్షరాల 28 కోట్లు.   

ఉధన్ ఫర్నిచర్, డార్క్ వాల్స్.. ఎంతో అందమైన స్విమ్మింగ్ పూల్.. లాంటి వాటితో.. ఈ ఇల్లు చూసిన వారిని ప్రేమలో పడేస్తోంది. ఈ ఇంట్లో ఫోటోలను మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్.. తరచూ తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link