Kanguva Pre Release Business: ‘కంగువా’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ .. సూర్య ముందు బిగ్ చాలెంజ్..
Kanguva Pre Release Business: ‘కంగువా’ సినిమా టైటిల్ తోనే అంచనాలు పెరిగాయి. సూర్య ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసాడు. ఈ సినిమాలో సూర్య ఫస్ట్ టైమ్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. హీరోగా సూర్యకు తొలి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పాలి.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అంతేకాదు సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా నిలిచింది.
అంతేకాదు సూర్య కెరీర్ లోనే సినిమా హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. సైకాలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుంది.
మరోవైపు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కర్ణాటకలో రూ. 10.50 కోట్ల బిజినెస్ చేయడం విశేషం.
కేరళలో రూ. 10 కోట్లు.. ఓవర్సీస్.. రూ. 40 కోట్లు.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 178.5 కోట్ల (రూ. 360 కోట్ల గ్రాస్) ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, హీరోయిన్ గా దిశా పటానీ నటించింది.
‘కంగువా’ సినిమా హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర 180 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంది. ఒక రకంగా సూర్య ముందుర పెద్ద టార్గెట్ ఉంది. అంతేకాదు కొండలాంటి ఈ టార్గెట్ కొట్టాలంటే .. ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ వస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదు. మరి ఈ సినిమాతో సూర్య.. ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.