Suriya: సినిమా షూటింగ్ లో ఊహించని ఘటన.. హీరో సూర్య తలకు గాయం.. అసలేం జరిగిందంటే..

Fri, 09 Aug 2024-7:13 pm,

తమిళ సూపర్ స్టార్ హీరో సూర్యకు షూటింగ్ లో ఉండగా అనుకోని ఘటన ఎదురైంది. కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న మూవీ సూర్య 44 మూవీ ఊటిలో షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో అనుకోని ఘటన ఎదురైంది.

సినిమాకు సంబంధించి షూటింగ్ చేస్తుండగా.. ఆయన తలకు బలమైన గాయమైంది. వెంటనే అక్కడున్న మూవీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.  ఊటీలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. 

సూర్యకు టెస్టులు చేసిన డాక్టర్ లు ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని చెప్పారంట. తలకు గాయంకావడంతో స్కానింగ్ లకు రిఫర్ చేశారంట. దీంతో ఆయన కుటుంబంతో పాటు, అభిమానులు టెన్షన్ పడుతున్నారు. 

దీనిపై నిర్మాత రాజశేఖరన్ పాండియన్ స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని అన్నారు. అంతేకాకుండా.. ఆయన కోలుకోవడానికి కొంత సమయంపడుతుందన్నారు. అప్పటి దాక సినిమా షూటింగ్ లు చేయరని కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా... ప్రేమ, నవ్వు, యుద్ధం నేపథ్యంలో.. రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఊటిలో ప్రారంభమైంది. అక్కడ ప్రమాదం జరగ్గానే వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్ , పూజా హెగ్డే, జయరామ్, జోజు జార్జ్, కరుణాకరన్, నాసర్, సుజిత్ శంకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం సూర్య..  మూవీ కంగువ సినిమా రిలీజ్ కు సిద్దమౌతుంది. దీన్ని శివ తెరకెక్కించారు. ఈ మూవీ అక్టోబర్ 10 న విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link