Switzerland: ఆ గడియారంలో 12 గంటలవదు..రహస్యమేంటో తెలుసా...

Wed, 02 Dec 2020-10:44 am,

జర్మనీ భాషలో ఎల్ఫ్ అంటే 11 అని అర్ధం. జర్మనీ పౌరాణిక కధల ప్రకారం ఎల్ఫ్ వద్ద అలౌకికమైన శక్తి ఉంటుంది. అందుకే సోలోథర్న్ పట్టణవాసులకు 11 నెంబర్ తో అనుబంధం ఏర్పడింది.

సోలోథర్న్ పట్టణవాసులకు 11 నంబర్ తో ఉన్న అనుబంధంపై వివిధ రకాల కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఎంతో శ్రమించినా సరే ఇక్కడి ప్రజలకు ఏ పనిలో కూడా సక్సెస్ లభించలేదు. ఆ తరువాత కొంత కాలం గడిచాక..ఎల్ఫ్ రావడం ప్రారంభమైంది. అందరూ ఆనందంగా జీవించసాగారు.

సోలోథర్న్ పట్టణవాసులకు 11 నంబర్ తో ప్రత్యేక  అనుబంధముంది. అందుకే ఇక్కడ ఎక్కువ వస్తువుల్లో 11 నెంబర్లే ఉంచుతారు. అయితే 11 నెంబర్ పట్ల జనానికున్న అనుబంధం వెనుక  ఓ పాత కధ ప్రాచుర్యంలో ఉంది.

సోలోథర్న్ ప్రజలు తమ రెగ్యులర్ లైఫ్ లో కూడా 11 నెంబర్ కు అంతే ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్లు తమ పిల్లల 11వ బర్త్ డే ను ప్రత్యేకంగా జరుపుతారు. దీంతోపాటు 11వ బర్త్ డే రోజున ఇచ్చే బహుమతులు కూడా 11 నంబర్ కు సంబంధించి ఉంటాయి

సోలోథర్న్ చర్చ్ సెయింట్ ఉర్సూస్ లో కూాడా 11 నెంబర్లకు ప్రత్యేకత ఉంది. ఈ చర్చ్ 11 ఏళ్లలో నిర్మాణమైంది. ఇక్కడ మూడు నిచ్చెనల సెట్ ఉంది. ప్రతి సెట్ లో 11 వరుసలున్నాయి. అంతేకాదు..చర్చ్ లో 11 తలుపులు, 11 గంటలు ఉన్నాయి.

సోలోథర్న్ పట్టణంలో గడియారం నెంబర్లే కాకుండా చర్చ్, జంక్షన్ల సంఖ్య కూడా 11 చొప్పునే ఉంటుంది. అంతేకాకుండా..ఇక్కడ చరిత్రను సూచించే...టవర్ కూడా 11 నెంబరే ఉంటుంది.

సాధారణంగా గడియారాల్లో 1 నుంచి 12 వరకూ నంబర్లు ఉంటాయి. కానీ ఈ విచిత్రమైన గడియారంలో 11 నెంబర్లే ఉంటాయి. 12 నెంబర్ ఉండదు. అయితే కేవలం గడియారమే కాదు..చాలా వస్తువుల్లో 11 నెంబర్ కు ప్రత్యేకత ఉంది.

ప్రపంచంలోని ఈ వినూత్నమైన..విచిత్రమైన గడియారం స్విట్జర్లాండ్ లోని సోలోథర్న్ పట్టణంలో టౌన్ స్క్వేర్ వద్ద ఉంది..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link