Worst Breakfast Foods: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 వస్తువులను తీసుకోవడం చాలా ప్రమాదకరం..!
ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీని తీసుకోవడం మానుకోండి. ఇందులో ఉండే కెఫిన్ వల్ల పొట్టలో యాసిడ్ ఏర్పడి వాపు వస్తుంది. దీనికి బదలుగా మీరు పండ్ల రసాలు తీసుకోవడం చాలా మంచిది.
ఖాళీ కడుపుతో కార్బోనేటేడ్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు తాగడం వల్ల ఎసిడిటీ , కడుపు నొప్పి వస్తుంది. ఇందులో ఉండే కెమికల్స్ శరీరానికి హనీ కలిగిస్తుంది.
ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ఉదయాన్నే తింటే కడుపులో ఎసిడిటీ వస్తుంది. దీనికి బదులుగా మీరు ఇతర పండ్లను తీసుకోవడం చాలా మంచిది.
ఉదయం పూట స్పైసీ లేదా స్పైసీ ఫుడ్ తినడం మానుకోండి. ఇది పొట్టపై వాపుకు కారణం కావచ్చు. అలాగే జీర్ణవ్యస్థను దెబ్బతీస్తుంది.
బ్రేక్ ఫాస్ట్‌లో అతిగా వేయించిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆహారం జీర్ణం అవ్వడం చాలా కష్టం.