Bollywood Pairs: తమన్నా వర్సెస్ విజయ్ వర్మ, అందం-అంతస్థుల్లో అంతరమున్న బాలీవుడ్ ప్రేమ జంటలివే
Vicky Kaushal and Katrina Kaif
ఇంకో జంట ఇది. బాలీవుడ్‌లో కత్రినా కైఫ్ అందం గానీ, అభినయం గానీ, స్టార్‌డమ్ గానీ క్రేజ్ గానీ చాలా చాలా ఎక్కువ. ఈమె ముందు విక్కీ కౌశల్ స్థాయి తక్కువని అతనికే తెలుసు. ఈ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకూ దారితీసింది.
Vijay Varma and Tamannaah Bhatia
తమన్నా భాటియా గురించి అందరికీ తెలిసిందే. మిల్లీ బ్యూటీగా ఆమె అందం ముందు, ఫిజిక్ ముందు ఎవరూ సరిపోరు. అదే సమయంలో పలు హిట్ సినిమాలతో స్టార్‌డమ్ కూడా కావల్సినంత ఉంది. అలాంటి తమన్నా..ఏ మాత్రం స్టార్‌డమ్ లేని చిన్న నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.
Shah Rukh Khan and Gauri Khan
బాలీవుడ్ బాద్‌షాగా ఇప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ 25 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో గౌరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బాద్ షా దగ్గర ఏం లేకపోయినా ఇప్పుడు సర్వం ఉంది.
Ranveer Singh and Deepika Padukone
విజయ్ వర్మ ఒక్కడే కాదు రణవీర్ సింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతని కంటే పెద్దస్థాయిలో స్టార్‌డమ్ ఉన్న నటి, అందగత్తె దీపికా పదుకోన్‌తో ప్రేమ, ఆ తరువాత పెళ్లి రెండూ జరిగిపోయాయి.
Akshay Kumar and Twinkle Khanna
బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ఇప్పుడు పెద్ద నటుడే కావచ్చు. కానీ కొత్తలో పెద్దగా స్టార్‌డమ్ లేనప్పుడు అప్పట్లో టాప్ సెలెబ్రిటీ కుటుంబం రాజేష్ ఖన్నా కుమార్తె ట్వింకిల్ ఖన్నాతో ప్రేమ, పెళ్లి రెండూ జరిగిపోయాయి.