Tamarind Seeds: చింత గింజల్ని బైటపడేస్తున్నారా..?.. ఈ లాభాలు తెలిస్తే బీరువాలో దాచుకుంటారు..
ఎండాకాలంలో చింత పండు మార్కెట్ లోకి వస్తుంటాయి. వంటలలో చింత పండు లేకుంటే వంటను అస్సలు ఊహించుకోలేము. చింత పండు రసం, చింత పండు పప్పు ఇలా ప్రతి దాంట్లో చింత పండు ఉండాల్సిందే.
చింత పండులోపల చింత గింజలు ఉంటాయి. వీటి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కల్గుతాయి. వీటిని ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారంట.
చింత గింజల పౌడర్ లో కీళ్ల నొప్పుల్ని తగ్గించే గుణాలు ఉంటాయంట. ప్రతిరోజు కూడా చింత పండు పౌడర్ ను తీసుకుంటే దగ్గు, కఫంలు ఉండవంట. ముఖ్యంగా చింత గింజల్ని నీళ్లలో వేయాలి. ఆ తర్వాత దాన్ని గిర్నీలో వేసి పిండి అయ్యేలా చూడాలంట. ఆ పిండిని ఇంటికి తెచ్చుకుని రోజుకు ఒక స్పూన్ నీళ్లలో మిక్స్ చేసుకుని తాగాలంట.
మన పూర్వకాలంలో చింత పండు పౌడర్ ను ఎక్కువగా ఉపయోగించే వారంట. దీని పౌడర్తో బ్రష్ చేసుకున్న కూడా అది సూపర్ గా పనిచేస్తుంది. పళ్లు తెల్లగా మెరుస్తాయంట. చింత గింజల పౌడర్ ను పాలల్లో కల్పి ఫెస్ ప్యాక్ లాగా వేసుకుంటే.. ముఖం ముత్యంలా మెరుస్తుందంట.
ముఖం మీద ఉన్న మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయంట. అందుకు చింత పండు గింజల్ని కొంత మంది పడేయకుండా దాచుకుంటారంట. ఇది అతి కొద్ది మందికే దీని ఉపయోగాలు తెలుసని సమాచారం. ( Alert: జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు. కేవలం వైరల్ కంటెంట్ ఆధారంగా రాయబడింది)