Tamil Nadu Assembly Election 2021 Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థులు.. వారి గెలుపు, ఓటములు

Tue, 04 May 2021-2:21 am,

కొలాతూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ఏఐడిఎంకే పార్టీ కీలక నేతల్లో ఒకరైన ఆది రాజారాంపై విజయం సాధించారు.

ఇడప్పడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏఐడీఎంకే నేత, సీఎం కే పళనిస్వామి తన సమీప ప్రత్యర్థి అయిన డీఎంకే నేత టి సంబాత్ కుమార్‌పై గెలిపొందారు.

కొవిల్ పట్టి నియోజకవర్గం నుంచి ఏఎంఎంకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టిటివి ధినకరణ్ ఏఐడిఎంకే పార్టీ నేత కాదంబూర్ రాజు చేతిలో ఓటమిపాలయ్యారు.

ఉదయ నిధి స్టాలిన్. తమిళనాట సినీ స్టాల్‌వార్ట్‌గా, రాజకీయ దిగ్గజంగా పేరొందిన కరుణానిధికి మనవడిగా, ప్రస్తుత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి స్టాలిన్‌కి రాజకీయ నాయకుడిగా కంటే సినీ హీరోగానే ఎక్కువ గుర్తింపు ఉంది. 

సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి యువకుడిగా సినిమాల్లోకి వచ్చిన ఉదయనిధి స్టాలిన్.. ఆ తర్వాత తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువెల్లికెని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link