Munagaku Pachadi: అన్ని టిఫిన్స్ లోకి ఎంతో రుచికరంగా ఉండే.. ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి.
ఎంతో ఆరోగ్యకరంగా ఉండే మునగాకు పచ్చడి తయారీ విధానం కోసం ముందుగా రెండు కప్పుల మునగాకను బాగా కడిగి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలను వేయించి పక్కన పెట్టుకోండి.
అదే నూనెలో రెండు కప్పుల మునగాకును వేసి పచ్చివాసన పోయే వరకు.. ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోండి.
అందులోనే కొద్దిగా జీలకర్ర, మెంతులు కూడా వేసి వేయించండి. ఆ తర్వాత 2 టమోటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి..
మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో..ఈ మిశ్రమాన్ని మీ, నిమ్మకాయ సైజు చింతపండుని, 8 వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి మెత్తటి పేస్టుగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి.
మరోసారి స్టవ్ పైన కళాయి పెట్టి నూనె వేసుకొని.. కొద్దిగా ఆవాలు , జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించుకొని.. అవన్నీ చల్లారాక మునగాకు మిశ్రమంపై చల్లుకోండి.
అంతే టిఫిన్స్ తో పాటు అన్నం కి కూడా ఎంతో రుచికరంగా ఉండే మునగాకు పచ్చడి రెడీ.