Tasty Snacks: టేస్టీ అండ్ క్రిస్పీ మరమరాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఈ మధ్యకాలంలో చాలా మంది రుచికరమైన స్నాక్స్ ఐటమ్ తినాలని అనుకుంటారు కానీ అందులో కొంతమంది వంట చేయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే సింపుల్ పద్ధతిలో రుచికరమైన ఆరోగ్యకరమైన మరమరాలు స్నాక్ చేసుకుంటే , వేసవి కాలానికి పర్ఫెక్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్పవచ్చు. వీటిని చేసుకొని మీరు డబ్బాలో నిల్వ ఉంచుకుంటే వారం రోజుల పాటు మొదటి రోజు తిన్న టేస్ట్ యొక్క అనుభూతిని పొందుతారు ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి.
ఒక్కసారి గనుక మీరు తయారు చేసి వీటిని తింటే ఇక భవిష్యత్తులో బయట వీటిని కొనుగోలు చేయరు. అంత పర్ఫెక్ట్ గా మీరు చేసుకొని తినవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు ఒకసారి చూద్దాం.
క్రిస్పీ అండ్ టేస్టీ మరమరాలు స్నాక్ ఐటమ్ కోసం కావాల్సిన పదార్థాలు..మరమరాలు - 100 గ్రాములు, నూనె - 4 టేబుల్ స్పూన్లు, పసుపు - పావు చెంచా, పల్లీలు - 75 గ్రాములు, కరివేపాకు - 2 రెబ్బలు, కొబ్బరి పలుకులు - 1 కప్పు, కారం - 1 టేబుల్ స్పూన్ , ఉప్పు - రుచికి సరిపడా , వేయించిన జీలకర్ర పొడి - 1/2 టేబుల్ స్పూన్, పంచదార పొడి - 1 టేబుల్ స్పూన్
ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి దానిపైన పాన్ పెట్టి పాన్ లో 2 టేబుల్ స్పూన్ ల ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కాక మరమరాలు వేసి లో ఫ్లేమ్ మీద వేయించాలి. ఆ తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి.. మరమరాలు చిదిమితే , విరిగి సౌండ్ వచ్చేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో పల్లీలు, కొబ్బరి పలుకులు, కరివేపాకు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని.. అందులో వేయించిన మరమరాలు వేసి, పసుపు, కారం, ఉప్పు, వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి పలుకులు, కరివేపాకు, వేయించిన జీలకర్ర పొడి, పంచదార పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఇక క్రిస్పీ అండ్ టేస్టీ మరమరాలు సిద్ధం.