Tata Altroz CNG Car: అద్దిరిపోయే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు

Tue, 23 May 2023-5:08 pm,

Tata Altroz CNG Car: టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు బేసిక్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఎక్స్ షోరూం ధర 7.55 లక్షలు కాగా ఆ కారు వేరియంట్‌ని బట్టి రూ. 10.55 లక్షల వరకు ఉంది.

Tata Altroz CNG Car Booking Amount: టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు రూ. 21 వేలు టోకెన్ ఎమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

Tata Altroz CNG Car Variants : టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు మొత్తం 6 వేరియంట్స్‌లో లాంచ్ అయింది.  XE CNG, XM+ CNG, XM+ (S) CNG, XZ CNG, XZ+ (S) CNG, XZ+O (S) CNG వేరియంట్స్‌లో కార్లు లాంచ్ అయ్యాయి.

Tata Altroz CNG Car Advanced Features: ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో పాటు వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి లేటెస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎలిమెంట్స్ ఎన్నో ఈ కారుకి అదనపు హంగులు కానున్నాయి. 

Tata Altroz CNG Car Color Variants : టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు కలర్ వేరియంట్స్ విషయానికొస్తే.. ఆర్కేడ్ గ్రే, హై స్ట్రీట్ గోల్డ్, ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, అవెన్యూ వైట్, హార్బర్ బ్లూ, కాస్మో డార్క్ కలర్ వేరియంట్స్‌లో ఈ కారు లభిస్తోంది. 

Tata Altroz CNG Car Air Bags: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ టెదర్ యాంకరేజ్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కూడా ఈ కారు సొంతం. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link