Team India Diwali 2023 Pics: దీపావళి వేడుకల్లో సాంప్రదాయ దుస్తులతో హల్‌చల్ చేస్తున్న టీమ్ ఇండియా ఆటగాళ్లు
మొహమ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాలో ప్రమాదకర బౌలర్‌గా మారుతున్నారు. ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. దీపావళి పురస్కరించుకుని బ్లాక్ అండ్ వైట్ కుర్తాతో ఆకర్షిస్తున్నారు.
టీమ్ ఇండియా రథ సారధి రోహిత్ శర్మ భార్య రుతికాతో కలిసి వైవిద్యంగా కన్పించారు. దీపావళి సాంప్రదాయ దుస్తులతో హల్‌చల్ చేస్తున్నారు.
ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తూ అందర్నీ ఆకర్షించడమే కాకుండా ఇప్పుడు దీపావళి సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకుంటున్నారు.
భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ చాలా ప్రత్యేకంగా కన్పించారు. 2023 లో విరాట్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అందరికంటే అత్యధిక పరుగులు సాధించాడు.
జస్‌ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ విభిన్నమైన రంగుల్లో సాంప్రదాయ కుర్తాలో క్లిక్ మన్పించారు. ప్రపంచకప్‌లో ఈ ముగ్గురూ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు.