India ODI World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా ఫుల్ షెడ్యూల్ ఇదే.. సెమీస్ వరకు రూట్ మ్యాప్ రెడీ
ఆస్ట్రేలియాతో టీమిండియా అక్టోబర్ 8న ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడబోతుంది. అక్టోబరు 11న ఈ మ్యాచ్ జరగనుంది.
టోర్నీలో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌ను అహ్మదాబాద్ నుంచి తరలించాలని పాక్ కోరగా.. ఐసీసీ అభ్యర్థనను తిరస్కరించింది.
పుణెలోని ఎంసీఏ స్టేడియంలో అక్టోబర్ 19న పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది.
అక్టోబర్ 22న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో పోటీపడనుంది.
అక్టోబర్ 29న లక్నోలోని ఎకానా స్టేడియంలో డిఫెండింగ్ వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.
నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 2న ముంబైలో.. నవంబర్ 11న బెంగళూరులో రెండు క్వాలిఫయర్ జట్లతో పోటీపడనుంది.