Sanju Samson: లవర్‌తో సంజూ శామ్‌సన్ ఐదేళ్లు డేటింగ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ తన కెరీర్‌లోనే తొలి టీ20 సెంచరీని సాధించాడు. రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ తన పేరిటన రికార్డును నమోదు చేసుకున్నాడు.
క్రికెట్‌లో సీనియర్ ఆటగాడైన సంజూ శామ్‌సన్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆలస్యంగా అతడికి అవకాశాలు లభిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుత సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
క్రికెట్‌పరంగా అందరికీ అతడి విషయాలు తెలిసిందే. కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొందరికి మాత్రమే వివరాలు తెలుసు. అతడి ప్రేమ, పెళ్లి కథ ఆసక్తికరంగా ఉంది.
కేరళకు చెందిన సంజు శాంసన్ భార్య పేరు చారులత. వీరిది ప్రేమ వివాహం. వీరిద్దరూ తొలిసారి తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కళాశాలలో కలుసుకున్నారు.
పరిచయమైన తొలిసారి అనంతరం సంజూ సామ్‌సన్ వెంటనే చారులతకు తన ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అక్కడి నుంచి వారిద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది.
అలా కొనసాగిన వీరి ప్రేమ 2018లో పెళ్లిగా మారింది. సంజు, చారులత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఇద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారని సమాచారం.