Tejaswi Madivada: కమిట్మెంట్ ప్రమోషన్స్ లో రచ్చ రేపిన తేజస్వి.. హాట్ ట్రీట్ చూశారా?

Sun, 14 Aug 2022-7:20 pm,

రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్ -ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న మూవీ ”కమిట్మెంట్”. ఈ సినిమాలో తేజస్వి మదివాడ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించారు.    

ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయని, అందులో ఒకటి నాదని తేజస్వి మదివాడ అన్నారు. స్టోరీలో తన క్యారెక్టర్ సినిమా ఛాన్స్ అవకాశాల  కోసం తిరిగే క్యారెక్టర్ అని తేజస్వి చెప్పుకొచ్చారు.   

అందరూ సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేస్తారు కానీ ఈ కమిట్మెంట్ అనేది అన్ని ఇండస్ట్రీలలో ఉందని తేజస్వి వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటాం కనుక మనకి అందరికి ప్రాబ్లెమ్ గా ఉంటుందని, అయితే సినిమా ఇండస్ట్రీని బద్నాం చేయద్దని చెప్పేదే ఈ సినిమా అని చెప్పుకొచ్చారు.     

ఇక సినిమా పరిశ్రమలోకి వచ్చే వారికి చెప్పేదేమీ లేదు, కాంప్రమైజ్ అవ్వాలి అని ఏమి లేదని, ఏదైనా మన మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. రియల్ లైఫ్ లో నాకు జరిగిన సంఘటనలు ఉంటాయని సినిమాలో అది కూడా చూపామని అన్నారు. 

ఇండస్ట్రీలో మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా అంటే ఎవరూ అడగలేదని, అందరూ కూల్ గానే ఉన్నారని అన్నారు. తనకు చాలా మంది డైరెక్టర్స్ తెలుసని, వాళ్లతో నాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదని అన్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link