Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే అర్హతలు ఇవే!
Telangana Ration Cards: పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శనివారం జరిగిన సమావేశంలో రేషన్ కార్డులు పొందేందుకు కొన్ని అర్హతలు ప్రతిపాదించింది.
Telangana Ration Cards: గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు లోపు ఉంటే రేషన్ కార్డు పొందేందుకు అర్హులు.
Telangana Ration Cards: పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రూ.2 లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ప్రతిపాదించింది.
Telangana Ration Cards: రెండు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.
Telangana Ration Cards: అయితే అర్హతల మార్గదర్శకాలపై మంత్రివర్గ ఉప సంఘం బీఆర్‌ఎస్ పార్టీతోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు తీసుకోనుంది.
Telangana Ration Cards: అందరి అభిప్రాయం తీసుకునేందుకు కొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.
Telangana Ration Cards: ఈ ఏడాది ఆఖరులో కానీ 2025 ప్రారంభంలో కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలు ఉన్నాయి.