Inter Exams: ఇంటర్ పరీక్ష ఫీజు పెంపు.. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎంత చెల్లించాలంటే..?
తెలంగాణ ఇంటర్ బోర్డు జనరల్ మొదటి సంవత్సరం చదువుకునే విద్యార్థులు గతంలో రూ.510 చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం ఈ ఫీజు రూ.520 పెంచారు. ఇక వొకేషనల్ కోర్సు చదివే విద్యార్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.520 థియరీ పార్ట్, ప్రాక్టికల్స్‌కు రూ.230 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జనరల్ కోర్సు చేసేవారు రూ.520 చెల్లించాల్సి ఉంటుంది. వొకేషన్ కోర్సు చేసేవారు కూడా రూ.520 థియరీ, రూ.230 ప్రాక్టికల్‌కు మొత్తం రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ బోర్డు పరీక్షలకు ప్రతి ఏడాది 9 లక్షలకు పైగా హాజరు అవుతారు. ఈసారి ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాల్సిన గడువు నవంబర్ 6 నుంచి 26 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆలస్య రుసుము లేకుండా.ఇక లే్ ఫీజు చెల్లింపుల గడువు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 27 వరకు ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులు ఆలస్య రుసుముతో అయితే, అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు రూ.100 అదనంగా ఫీజు చెల్లించాలి. ఒకవేళ డిసెంబర్ 5 నుంచి 11 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లిస్తే రూ.500 అదనంగా కట్టాల్సి ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ బోర్డు మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులు డిసెంబర్ 12 నుంచి 18 వరకు వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించాలి. డిసెంబర్ 9 నుంచి 27 వరకు అయితే, ఏకంగా రెండు వేలు అదనంగా లేట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది.