Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!

Thu, 01 Aug 2024-7:07 pm,

Telangana Electricity New GPS System : వర్షాకాలంలో తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. చెట్ల కొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడటంతో కరెంటు నిలిచిపోతుంది. అలాంటి సమస్యల గురించి ప్రజలు విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తేనే వారికి సమాచారం అందుతుంది. దాని కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఎప్పటి నుంచో అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ బిల్లు వెనకాల కూడా స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల ఫోన్ నెంబర్లను ఉంటాయి. అయితే ఆ నెంబర్ల ఎంతకూ కలవవని..కలిసినా సిబ్బంది స్పందించరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.   

నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ, విద్యుత్ సరఫరా ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న 1912 కాల్ సెంటర్ తోపాటు ఫ్యూజ్ ఆఫ్ కాల్ (FOC) వ్యవస్థ లో లేటెస్టు టెక్నాలజీని  అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా 213 FOC కార్యాలయాల్లో ఉపయోగించే వాహనాల్లో యాప్  ఆధారిత GPS టెక్నాజీని పొందుపరిచారు. ఈ సదుపాయం వలన తమ విద్యుత్ సిబ్బంది, ఫిర్యాదుదారుడి ప్రాంతానికి ఎలాంటి సత్వరం చేరుకుని..వెంటనే సమస్యను పరిష్కరించే వీలు ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి, ఐఏఎస్ తెలిపారు.       

గురువారం విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో 1912 కాల్ సెంటర్ (విద్యుత్ కంట్రోల్ రూమ్) ఫ్యూజ్ ఆఫ్ కాల్ (FOC) పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.  వినియోగదారుల సరఫరా సంబంధిత ఫిర్యాదులను, ఇతర ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు గాను వీలైనంత మేర లేటెస్ట్ టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. సంస్థ పరిధిలో నిర్వహించే కార్యకలాపాలకు సంబంధించి విద్యుత్ సరఫరాపై  ఫిర్యాదులు, బిల్లింగ్ ఫిర్యాదులు, బ్రేక్ డౌన్ సమాచారం, ఫీడర్ల సమాచారం, బిల్లింగ్,కలెక్షన్ సమాచారం వంటి వివరాలతో కూడిన సమీకృత డాష్ బోర్డు ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ టెక్నాలజీతో  రియల్ టైం లో సమాచారం తెలుసుకునే వీలుంటుందని సీఎండీ తెలిపారు.   

గత ఆరు నెలలుగా నమోదైన విద్యుత్ సరఫరా సంబంధిత ఫిర్యాదులను, గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అంతరాయాల ఫిర్యాదులు బాగా తగ్గాయని తెలిపారు. 1912 కాల్ సెంటర్ (విద్యుత్ కంట్రోల్ రూమ్) కు గతేడాది జనవరి - జూన్ 2023 లో 5,83,672 సరఫరా సంబంధిత ఫిర్యాదులు అండగా ఈ ఏడాది జనవరి - జూన్ 2024 వరకు 31.82 శాతం తగ్గుదలతో 3,97,934 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అదే విధంగా ట్విట్టర్ కంప్లైంట్స్ సైతం జనవరి - జూన్ 2023 వరకు 35,949 ఉండగా.. ఈ ఏడాది 60.96 శాతం తగ్గుదలతో 14,035 గా నమోదయ్యాయి.   

విద్యుత్ కంట్రోల్ రూమ్  1912 ను మరింతగా బలోపేతం చేసినట్లు సీఎండీ తెలిపారు. 74 మంది  ఆపరేటర్లు 24x7 అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ అధునాతన కాల్ సెంటర్ ద్వారా ఒకేసారి 400 కాల్స్ అందుకునే సరికొత్త టెక్నాలజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులు ఈ 1912 కి కాల్ చేసి తమ ఫిర్యాదు నమోదు, దానికి సంబందించిన కంప్లైంట్ ఐడీని కూడా పొందేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link