Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..
రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డుతోనే అన్ని పథకాలు అమల్లోకి వస్తున్నాయి. కాబట్టి రేషన్ కార్డు ఎంతో ముఖ్యం. అయితే చాలామంది కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది.
రేషన్ కార్డులు తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంతే కాదు రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలని సదుపాయం కూడా కల్పించింది.
మీసేవ సెంటర్లోకి వెళ్లి కావలసిన ధృవపత్రాలను అందించి, మీ రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను జత చేయవచ్చు లేదా ఏమైనా మార్పులు చేసుకోవచ్చు.
మీసేవ సెంటర్ వెళ్లి మీ కుటుంబ సభ్యుల పేరుని నమోదు చేసుకోవచ్చు. దానికి కావలసిన పత్రాలను సమర్పించాలి. అంటే ఆధార్ కార్డు పిల్లల పేరు నమోదు చేయాల్సి వస్తే పుట్టిన సర్టిఫికెట్. భార్య పేరు నమోదు చేయాల్సి వస్తే మ్యారేజ్ సర్టిఫికెట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలు అందించిన తర్వాత మీసేవ సెంటర్లో నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్లో మీ రేషన్ కార్డు ఆన్లైన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో ఏర్పాటు అయినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతోంది. ప్రజా పాలనలో భాగంగా రేషన్ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, కొత్త రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది.