Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..
పంపిణి రంగం నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత రెడ్డిని కలిసి తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. అంతేకాదు ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు. అంతేకాదు గద్దర్ అవార్డ్స్ విధి విధానాలను కూడా సీఎం ముందు ప్రస్తావించారు కొత్తగా ఎన్నికైన ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.
ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ.. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా తమకు సమయం ఇచ్చి మా సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదు సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎపుడు తమ సహాయ సహకారాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హామి ఇచ్చిన విషయాన్ని భరత్ భూషణ్ ప్రస్తావించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందకు భరత్ భూషణ్ గారికి ప్రభుత్వం తరుపున అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
నా అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించడానికి సిద్దంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.