Central Bank of India: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటా విక్రయం.. కేంద్రం సంచలన నిర్ణయానికి కారణాలు ఇవే!

Tue, 19 Nov 2024-4:52 pm,

Banks Stake Sale:  కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వాటిల్లో వాటాను విక్రయించడం లేదా ప్రైవేటీకరణ చేయడం చూస్తూనే ఉన్నాము. ఇంకా కొన్నింటిని విలీనం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ సబ్ బ్రాంచులన్నీ ఎస్బీఐగా ఏర్పడింది. ఇతర చిన్న బ్యాంకులు కొన్ని కూడా కలిసి విలీనం అయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది.

తాజాగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలోని నాలుగు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటాలను విక్రయించాలనే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుందని..ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఇప్పటికే కథనాలు కూడా వెలువడుతున్నాయి. 

దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వాటాల విక్రయం జరగుతున్నట్లు సమాచారం.  ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంకుల్లో కేంద్రం ఇప్పుడు వాటా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపించినట్లు సమాచారం. రాబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓపెన్ మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ రూపంల వాటా విక్రయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

బీఎస్ఈ వెబ్ సైట్లోని డేటా ప్రకారం..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ప్రభుత్వానికి 93 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. అటు  ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 96.4శాతం, యూకో బ్యాంకులో 95.4శాతం.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 98.3 శాతం కంటే ఎక్కువగా వాటా కలిగి ఉంది.   

అయితే సెబీ మార్గదర్శకాల ప్రకారం అన్ని నమోదిత కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25శాతం ఉండాల్సిందే. ఈ రూల్స్ నుంచి ప్రభుత్వ యాజమాన్య సంస్థలకు 2026 ఆగస్టు వరకు సెబీ మినహాయింపు కలిపించంది. 

ఈ క్రమంలోనే ఈ రూల్స్ అనుగుణంగా 75శాతం కంటే దిగువకు తెచ్చేందుకు బ్యాంకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు  తెలుస్తోంది. అందుకే వాటా విక్రయించేందుకు చూస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link