Dying Prohibited Cities: చావడం కూడా నిషేధం.. ప్రశాంతంగా చచ్చిపోనివ్వనీ ఆ నగరాలు ఏమిటో తెలుసా?
Dying Ban City: మరణంపై నిషేధం విధించిన కొన్ని నగరాలు ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని నగరాలు మృతిపై నిషేధం విధించాయి. అవేంటో.. ఎందుకో తెలుసుకోండి.
సెల్లియా (ఇటలీ) Dying Ban City: ఇటలీలోని మధ్యయుగపు కొండప్రాంత పట్టణం సెల్లియా. ఈ నగర పరిధిలో నివాసితులు అనారోగ్యానికి గురికాకుండా నిషేధం విధించారు. పట్టణంలో రోజురోజుకు జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో అనారోగ్యంతో మృతి చెందడం నిషేధం విధించారు. వ్యక్తులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే వారికి జరిమానాగా అధిక పన్నులు విధిస్తారు. ఈ రకంగా మరణిస్తే పెద్ద శిక్ష వేసే అవకాశం ఉంది.
లాంగ్‌ఇయర్‌బైన్ (నార్వే) Dying Ban City: నార్వేలోని స్వాల్‌బార్డ్ ద్వీపంలోని ప్రధాన నగరం లాంగ్‌ఇయర్‌బైన్. ఈ నగరంలో 'నో డెత్ పాలసీ' (చనిపోవడం నిషేధం విధానం) ఉంది. ఇది కొండప్రాంతాలు.. మంచుతో నిండి ఉంటుంది. ఇక్కడ ఖననం చేసిన శరీరాలు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండడంతో కుళ్లిపోవు. ఫలితంగా నగరంలో 1950 నుంచి సమాధి చేయడంపై నిషేధించారు.
లే లావాండౌ (ఫ్రాన్స్) Dying Ban City: పర్యావరణ ఆందోళనల కారణంగా ఫ్రాన్స్‌లోని లే లావాండౌ పట్టణంలో కొత్త స్మశానవాటికకు అధికారులు అనుమతించలేదు. ఈ కారణంలో 2000 సంవత్సరంలో అక్కడి మేయర్ మరణాలపై నిషేధం విధించారు.
ఇత్సుకుషిమా (జపాన్) Dying Ban City: షింటో మతం ప్రకారం జపాన్‌లోని ఇట్సుకుషిమా ద్వీపం పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది. 1868 వరకు ఇక్కడ చనిపోవడం లేదా ప్రసవించడంపై నిషేధం అమల్లో ఉంది. నేటి రోజు వరకు ద్వీపంలో శ్మశానవాటికలు, ఆసుపత్రులు లేకపోవడం విశేషం.
కుగ్నాక్స్ (ఫ్రాన్స్)
Dying Ban City: ఫ్రెంచ్ నగరమైన కుగ్నాక్స్‌లో చనిపోవడం ఒక నేరం. ఇక్కడ కొత్త శ్మశాన వాటికను తెరవడానికి అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అక్కడ చనిపోవడంపై నిషేధం విధించారు. అయితే ఆ తదనంతరం అధికారులు కొత్త స్మశానవాటికకు అనుమతి ఇచ్చారు. దీంతో అక్కడ చనిపోవడంపై నిషేధం ఎత్తేశారు. కాకపోతే మొన్నటి వరకు అక్కడ చనిపోవడం నిషేధం.