Ayurvedic Tips For Heart Blockage: రక్తం గడ్డకట్టకుండా బ్లడ్ సర్క్యూలేషన్ పెంచే 5 డ్రింక్స్..

Sun, 03 Mar 2024-10:05 am,

హార్ట్‌ అటాక్ రాకుండా.. రక్తం గడ్డకట్టకుండా ఉంచేందుకు కొన్ని ఆయుర్వేద పానియాలు ఉన్నాయి. ఇవి గుండె సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.  స్ట్రోక్, రక్తనాళాల్లో రక్తంగడ్డకట్టుట, హార్ట్‌  బ్లాకేజీ, హైబీపీ, రక్తప్రసరణకు అడ్డపడే కొలెస్ట్రాల్ ను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఏ ఆయర్వేదిక డ్రింక్స్ రక్తం గడ్డకుండా మనల్ని కాపాడుతాయో తెలుసుకుందాం.  

అల్లం, పసుపు.. ఈ రెండూ మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.  అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాదు రక్తం గడ్డకుండా బ్లాక్స్ ఏర్పడకుండా చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అల్లం పసుపు కీలకపాత్ర పోషిస్తాయి.

బీట్‌రూట్ జ్యూస్.. బీట్ రూట్ జ్యూస్ ఎంతో ఆరోగ్యకరమైన జ్యూస్. ఇది కేవలం గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు బ్లడ్ ప్రెజర్ను కూడా అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ మీ డైట్లో చేర్చుకోండి అద్బుతాలను చూస్తారు. ఈ జ్యూస్ మన శరీరంతో రక్తం గడ్డకుండా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా మన శరీరంలో పనిచేస్తుంది.

ఉసిరి జ్యూస్.. ఉసిరికాయ ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా కీలకపాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే. ఉసిరికాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీంతో మన శరీరంలో రక్తం గడ్డకుండా రక్త ప్రసరణను మెరుగుపరిచే శక్తి ఉసిరికాయకు ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గుండె సమస్యలు రాకుండా రక్తప్రసరణకు కొలెస్ట్రాల్ అడ్డుపడకుండా చేస్తుంది ఉసిరి. ఉసిరి రసం కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.

అర్జున బెరడు.. ఇది అన్నీ ఆయుర్వేదిక్ దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది. అర్జున బెరడుతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకుండా.. గడ్డకట్టిన రక్తాన్ని కూడా శుభ్రం క్లీన్ చేస్తుంది. అర్జున బెరడు బ్లడ్ సర్క్యూలేషన్‌ను పెంచుతుంది.  కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది.

మందార టీ.. మందార టీ కూడా శరీరంలో రక్తం గడ్డకుండా చేస్తుంది. ఇందులో ఉండే అథెరోస్లెరోసిస్, వాపు, హై బ్లడ్ ప్రెజర్ సమస్యల ఉన్న రోగులు వీటిని కచ్చితంగా వారి డైట్లో చేర్చుకోవాలి. ప్రతిరోజూ ఓ కప్పు మందార టీ లేదా జ్యూస్ తీసుకోవాలి. మందార టీ గుండె సమస్యలను దూరంగా ఉంచుతుందని, రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుందని అధ్యయనాలు తెలిపాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link