5 Rules Changing From June 1: ఈపీఎఫ్ Aadhaar లింకింగ్ సహా జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

Tue, 01 Jun 2021-11:07 am,

EPFO Aadhaar linking: ఈపీఎఫ్ ఆధార్ ఖాతా అనుసంధానం EPFO కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి ఖాతాదారుడు/ ఖాతాదారురాలు తన EPF ఖాతాను ఆధార్‌తో (EPFO-Aadhaar link) అనుసంధానం చేసుకోవాలి. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను  ఆధార్‌తో అనుసంధానం చేసుకునేలా చూసుకోవడం సంస్థల బాధ్యత. ఉద్యోగులు అలా చేయడంలో విఫలమైతే, ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. ఈపీఎఫ్ ఖాతాకు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ నిలిపివేస్తారు. దీనికి సంబంధించి ఈపీఎఫ్‌వో ఇదివరకే ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read: EPFO Alert: కరోనాతో EPF ఖాతాదారులు మరణిస్తే, నామినీకి రూ.7 లక్షల పరిహారం

Costlier Air Travel: ఖరీదైన విమాన ప్రయాణం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం (మే 28)న కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన ప్రయాణ టికెట్ ఛార్జీలపై 15 శాతం మేర ధరలు పెంచింది. సవరించిన టికెట్ల ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తమ ఉత్తర్వులలో పేర్కొంది.

Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

YouTube Tax: ఇండియన్ యూట్యూబర్లకు పన్ను  యూట్యూబర్‌లకు సైతం కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. మీరు భారతీయ యూట్యూబర్‌ అయితే, అమెరికా నుంచి జరిగి వీక్షణలకు మీరు డబ్బు సంపాదిస్తున్నారా. అయితే మీరు ఆ వ్యూస్‌తో వచ్చే ఆదాయంలో 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలోనే యూట్యూబ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేవలం అమెరికా యూట్యూబ్ వీడియో క్రియేటర్స్‌కు దీని నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి

Income Taxs e-tax filing site: ఆదాయపు పన్ను శాఖ ఇ-టాక్స్ ఫైలింగ్ సైట్‌లో మార్పులు   ఆదాయపు శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్ ఇ-టాక్స్ ఫైలింగ్ సైట్ జూన్ 1 నుండి జూన్ 6 వరకు ఏ సేవలు అందించదు. ఈ రోజులలో అధికారులు వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తున్న కారణంగా వెబ్‌సైట్ పనిచేయదు. ఐటీ శాఖ కొత్త వెబ్‌సైట్ http://INCOMETAX.GOV.IN జూన్ 7 నుండి తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం.

Bank Of Baroda Cheque Payment Rules: బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కు చెల్లింపులలో మార్పులు  బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కుల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జూన్ 1 నుండి చెక్ చెల్లింపులపై సవరించిన నియమాలు అమలులోకి రానున్నాయి. నేటి నుంచి చేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా  బ్యాంక్ పాజిటివ్ పే నిర్ధారణను తప్పనిసరి చేసింది. దీని ప్రకారం ఎవరైనా ఖాతాదారులు చెక్కు రూపంలో రూ .2 లక్షలకు పైగా చెల్లింపులు జరిపాలంటే, కస్టమర్ మరోసారి దాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా చేసిన తరువాతే మీరు ఇచ్చిన చెక్కు చెల్లుబాటు జరిగి లావాదేవీలు పూర్తవుతాయి. లేని పక్షంలో ఆ చెక్కు రద్దు అవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link