Honeymoon Places: కొత్తగా పెళ్లయ్యిందా.. హనీమూన్‌ కోసం ఈ ప్రాంతాలకు వెళ్తే మీకు స్వర్గం అనుభూతే!

Mon, 25 Nov 2024-5:03 pm,

కొత్తగా పెళ్లయ్యిందా.. హనీమూన్‌ కోసం ఈ ప్రాంతాలకు వెళ్తే మీకు స్వర్గం అనుభూతే!

షిమ్లా, హిమాచల్ ప్రదేశ్: క్వీన్ ఆఫ్ హిల్స్ అని సిమ్లాను పిలుస్తారు. ఇది ప్రశాంతమైన.. భార్యాభర్తలు ఏకాంతంగా గడిపేందుకు అద్భుతమైన పర్యాటక స్థలం. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పచ్చదనంతో సిమ్లా ఎంతో సుందరంగా ఉంటుంది. ఐకానిక్ క్రైస్ట్ చర్చ్, జాఖూ హిల్ నుంచి ప్రకృతి విశాల దృశ్యాలను చూసి ఆశ్చర్యపడండి.

గోవా: మీ భాగస్వామితో బీచ్‌లు, రాత్రి జీవితాన్ని ఆస్వాదించాలంటే గోవా అద్భుతమైన ఎంపిక. బంగారు ఇసుక, నీలాకాశంతోపాటు సముద్రంతో ప్రశాంతంగా గడపవచ్చు. పలోలెం, వాగేటర్ వంట బీచ్‌లు చక్కటి ఎంపిక. బీచ్‌సైడ్ పార్టీలలో మీ రాత్రులు డ్యాన్స్ చేయండి.

మున్నార్, కేరళ: పశ్చిమ కనుమలలో ఉన్న మున్నార్ ప్రకృతిని ప్రేమించే జంటలకు స్వర్గధామం. తేయాకు తోటలు, పొగమంచు కొండలు, జలపాతాలకు మున్నార్  ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఎరవికులం జాతీయ పార్క్‌ని సందర్శించండి. కుండలా సరస్సులో బోట్ రైడ్‌ని కొత్త జంటలకు అద్భుతం. విస్టాస్ కోసం ఎకో పాయింట్‌కి ట్రెక్కింగ్ కూడా ఉంది.

ఉదయ్‌పూర్, రాజస్థాన్: "సరస్సుల నగరం"గా ఉదయపూర్ ప్రసిద్ధి చెందినది. రాచరికపు కోటలు కొత్త జంటలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. సరస్సులు, అద్భుతమైన కోటలు, విభిన్న కలెక్షన్లతో బజార్‌లు ఉన్నాయి. పిచోలా సరస్సులో సూర్యాస్తమయం సమయంలో పడవ ప్రయాణం చేయడం మరచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుంది. సిటీ ప్యాలెస్‌, సహేలియోన్ తోటలను కూడా సంద్శించవచ్చు.

అలెప్పీ, కేరళ: "వెనిస్ ఆఫ్ ది ఈస్ట్"గా అలెప్పీని పిలుస్తారు. హనీమూన్ అనుభూతి పొందేందుకు అలెప్పీ చక్కటి ఎంపిక. హౌస్ బోట్‌లో.. జలాకాడుతూ గడిపేందుకు అలెప్పీ ప్రసిద్ధి.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్: దేశంలోనే అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం డార్జిలింగ్‌. డార్జిలింగ్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సుగంధ తేయాకు తోటలకు ప్రసిద్ధి. కాంచన్‌గంగా పర్వతం మీదుగా సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాన్ని చూడడం మరచిపోలేని జ్ఞాపకం.

అండమాన్, నికోబార్ దీవులు హనీమూన్‌ వెళ్లే జంటలకు అండమాన్ నికోబర్‌ దీవులు మధురానుభూతి కలిగిస్తాయి. సముద్రపు ఒడ్డున.. తెల్లటి ఇసుక బీచ్‌లలో విహరించవచ్చు. అండమాన్ దీవులలో స్వర్గపు అంచును అందుకోవచ్చు. రాధానగర్ బీచ్‌, సెల్యులార్ జైలు, స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్‌ కూడా ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link