IPL 2023: ఈ సీజన్‌లో దారుణంగా ఫ్లాప్ అయిన ప్లేయర్లు.. ఇకనైనా ఆడండయ్యా..!
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఈ సీజన్ ప్రారంభానికి ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రిషబ్ పంత్ గైర్హాజరీలో షాపై మరింత బాధ్యత పెరగ్గా.. ఆ బాధ్యతను మర్చిపోయి ఈజీగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 34 పరుగులే చేశాడు. పృథ్వీ షాకు ఢిల్లీ యాజమాన్యం రూ.8 కోట్లు చెల్లిస్తోంది. పృథ్వీ షా ఆరంభంలోనే ఔట్ అవుతుండడంతో మిగిలిన ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది.
ఢిల్లీ జట్టులో నిరాశపర్చిన మరో ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. సీజన్ ఆరంభానికి ముందు దేశవాళీ టోర్నీల్లో సెంచరీల వరద పారించాడు. ఐపీఎల్‌లో కూడా దుమ్ములేపుతాడని అందరూ భావించారు. 2 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాగా.. కేవలం 34 పరుగులే చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే సీజన్.. సీజన్‌కు ఈ అస్సాం ఆల్‌రౌండర్ మరింత విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ మ్యాచ్‌ల్లో కేవలం 54 పరుగులు చేశాడు.
స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్‌గా కంటే బౌలర్ గానే రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ కేవలం 80 రన్స్ మాత్రమే చేశాడు. కృనాల్ బ్యాట్స్‌మెన్‌గా పరుగులు చేయాలని లక్నో టీమ్ కోరుకుంటోంది.
గత సీజన్‌లో అదరగొట్టిన ఆయూష్ బదోని.. ఈసారి అదే ఫామ్ కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు. బదోని 6 మ్యాచ్‌ల్లో కేవలం 77 రన్ప్ మాత్రమే చేశాడు. ఈ యంగ్ ప్లేయర్ పుంజుకుని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.