Top Indebted Countries: అప్పులేని దేశమే లేదు! ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలు ఇవే!
Indebted Countries: ఐఎంఎఫ్ ప్రకారం.. || దేశాల అప్పుల విషయమై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో విస్తుగొలిపే విషయాలు ఉన్నాయి. అగ్ర దేశాలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఏ దేశం ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసుకోండి.
Indebted Countries: అప్పుల్లో నంబర్ వన్ జపాన్ || అత్యంత అప్పు కలిగిన దేశంగా జపాన్ నిలుస్తోంది. అప్పుల్లో తొలిస్థానం ఉంది. చుట్టూ సముద్రపు తీరప్రాంతం.. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉన్నంత స్థాయిలో చిన్నగా ఉండే జపాన్ అత్యధిక అప్పులు చేస్తోంది. ఈ దేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది. అయినా కూడా అప్పులు అదేస్థాయిలో భారీగా ఉన్నాయి. ఆ దేశ జీడీపీలో అప్పులు 216 శాతం ఉంన్నాయి.
Indebted Countries: రెండో స్థానం గ్రీస్ || అప్పుల్లో రెండో దేశం గ్రీస్ నిలిచింది. ఈ దేశంలో సుదీర్ఘకాలంగా రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ్రీస్ దేశ జీడీపీలో అప్పుల శాతం 203 ఉంది. ఈ అప్పులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Indebted Countries: ధనిక దేశం కూడా || అత్యంత సంపన్న దేశంగా పిలిచే యునైటెడ్ కింగ్‌డమ్.. లేదా బ్రిటన్ అప్పుల్లో మూడో స్థానంలో ఉంది. బ్రిటన్ జీడీపీలో 142 శాతం అప్పులు ఉన్నాయి. అయితే ఈ అప్పులు దేశ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రాజకీయాలను అప్పు తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Indebted Countries: లెబనాన్ అప్పుల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ దేశంలో ఆర్థిక సమస్యలు, ప్రాంతీయ సమస్యలు, రాజకీయ అస్థిరత కారణంగా అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ దేశం తన జీడీపీలో 128 అప్పులు కలిగి ఉంది.
Indebted Countries: స్పెయిన్ || అందాల స్పెయిన్ దేశం అప్పులతో తల్లడిల్లుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వైరస్ ప్రభావం ఆ దేశ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ దేశ జీడీపీలో అప్పులు 111 శాతం ఉన్నాయి.
Indebted Countries: అగ్రరాజ్యం యూఎస్ || ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా కూడా అప్పుల్లో కూరుకుపోయింది. దేశ జీడీపీలో 110 శాతం అప్పులు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం, కరోనా, పన్ను విధానాలు అప్పులు పెరగడానికి కారణాలుగా మారాయి.
Indebted Countries: భారత్ మెరుగైన స్థితి || ఇక మన దేశం విషయానికి వస్తే అప్పుల్లో కొంత మెరుగైన పరిస్థితి కలిగి ఉంది. మన దేశ జీడీపీలో 46 శాతం మాత్రమే అప్పులు ఉండడం విశేషం. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న భారత్ ప్రపంచ దేశాలతో పోలిస్తే అప్పుల్లో వెనుకంజలో ఉండడం గమనార్హం. టాప్ 5 ఆర్థిక వ్యవస్థలో భారత్ చోటు సంపాదించుకుంది.