EPF: మీ పీఎఫ్ అకౌంటు బ్లాక్ అయ్యిందా..అయితే ఆన్ లైన్ ద్వారా ఈ సింపుల్ స్టెప్స్ తో యాక్టివేట్ చేసుకోండి
How To Unblock EPF Account : నెలలవారీ జీతం పొందే ఉద్యోగులు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ను కలిగి ఉంటారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ కోసం భారత ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధిని ఏర్పాటు చేసింది. ఇది ఉద్యోగుల పదవీ విరణమ పొదుపు పథకం. ఈపీఎఫ్ స్కీం ద్వారా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తారు.
ఈ పథకం కోసం ఉద్యోగులు తమ నెల వారీ జీతం నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. అయితే కొన్నిసార్లు ఉద్యోగ రిటైర్మెంట్ , మరణం లేదా మరేదైనా కారణం వల్ల వరుసగా మూడేండ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈపీఎఫ్ కు సహకరించని యెడలా అలాంటి అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. అలాంటి అకౌంట్స్ బ్లాక్ అవుతుంటాయి. ఇందులోని డబ్బు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. అయితే అలాంటి బ్లాక్ చేసిన ఇన్ యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలను ఈపీఎఫ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ, పీఎఫ్ అకౌంట్స్ అన్ బ్లాక్ చేసేందుకు కొత్త ఎస్ఓపీని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఎస్ఓపీ ప్రకారం కస్టమర్ు తమ ఈపీఎఫ్ అకౌంట్ ను అన్ బ్లాక్ చేసేందుకు ముందు వారి కేవైసీ వివరాలను వెరిఫై చేయాలి. అంటే ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ పత్రాలైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ బ్యాంక్ వివరాలను ధ్రువీరించాల్సి ఉంటుంది. యూజర్ ఈపీఎఫ్ అకౌంట్ సేఫ్టీని నిర్వహించేందుకు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. కేవైసీ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఫాలో అయి ఈపీఎఫ్ అకౌంట్ ను అన్ బ్లాక్ చేసుకోవచ్చు.
మీరు ఇప్పటికీ EPF అండ్ MP చట్టం, 1952 పరిధిలోని సంస్థలో పని చేస్తున్నట్లయితే, మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మీ కొత్త ఖాతాలోకి మొత్తం బదిలీ చేయాలి. మీరు పదవీ విరమణ చేసినట్లయితే, మీరు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
PF చందాదారులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పని చేయని EPF ఖాతాలను సులభంగా అన్‌బ్లాక్ చేయవచ్చు. వారు Umang యాప్ లేదా OTP ఆధారిత ధృవీకరణ వంటి ఇతర మోడ్‌లను కూడా ఉపయోగించవచ్చు.
దశ 1: అధికారిక EPFO వెబ్‌సైట్‌కు వెళ్లండి.
దశ 2: మీ UAN ఆధారాలను ఉపయోగించి మీ EPFO ఖాతాకు లాగిన్ అవ్వండి.
దశ 3: 'హెల్ప్ డెస్క్' విభాగానికి వెళ్లాలి.
దశ 4: 'ఇన్‌ఆపరేటివ్ అకౌంట్ అసిస్టెన్స్' ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
దశ 5: అందులో అవసరమైన వివరాలన్నీ ఎంటర్ చేయాలి. మీ ఐడెంటింటినీ గుర్తించాలి.
అయితే, కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం మీరు మీ EPF ఖాతాను అన్‌బ్లాక్ చేయడంతో కొనసాగాలనుకునే ముందు మీ KYC (నో యువర్ కస్టమర్) వివరాలు స్పష్టంగా ఉండాలి. KYC వివరాలలో మీ గుర్తింపు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలను స్థానంలో, సీడ్‌లో ధృవీకరించడం ఉంటుంది.