Rich favourite Destination: ఈ ఇస్తామిక్‌ దేశం ధనవంతుల గమ్యస్థానం.. ఈ ఏడాది 4000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వీడనున్నారట..

Fri, 30 Aug 2024-4:13 pm,

'హెన్లీ & పార్ట్‌నర్స్' నివేదిక ప్రకారం రూ.10 కోట్ల ఆస్తులతో 1,044 మంది మిలియనీర్ల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో, 120 మంది బిలియనీర్లతో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.   

 2023 సంవత్సరంలో కూడా చాలా మంది ధనవంతులు UAEలోనే స్థిరపడ్డారు. మిలియనీర్ల వలసల ప్రపంచ పోలికలో, చైనా మరియు బ్రిటన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉండవచ్చని 'హెన్లీ & పార్ట్‌నర్స్' నివేదిక వెల్లడించింది  

మంచి జీవనశైలి, వ్యాపార అవకాశాలు లేదా పిల్లల చదువులు వంటి మెరుగైన అవకాశాల కోసం కొంతమంది వలసలను   ఎంచుకుంటున్నారని 'హెన్లీ & పార్ట్‌నర్స్' నివేదిక పేర్కొంది. అయితే మరికొందరు మిలియనీర్లు భద్రతా కారణాల దృష్ట్యా, పన్ను ప్రయోజనాల కోసం కూడా ఇలా వలస ఎంచుకుంటారు.   

ముఖ్యంగా యూఏఈ లో పన్ను రేట్లు చాలా తక్కువ. అంతేకాదు ఇక్కడి వాతావరణం ,వ్యాపారానికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే యూఏఈ ధనవంతుల ఇష్టమైన దేశంగా మారింది. దుబాయ్ నగరం ధనికులకు జీరో ఆదాయపు పన్ను సౌకర్యాన్ని అందిస్తుంది. దీనితో పాటు ఇక్కడ మెరుగైన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ,పారిశ్రామికవేత్తలకు అనువైంది.  

నివేదికల ప్రకారం గడిచిన 5 ఏళ్లలో 8,34,000 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం 2 లక్షలకు పైగా 20 శాతం పెరిగింది. రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం 2023 సంవత్సరంలో 2,16,000 మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ముఖ్యంగా వీళ్లు ఎంచుకుంటున్న డెస్టినేషన్‌ ఎక్కువశాతం యూఏఈ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link