Shruti Hassan: పెళ్లయిన హీరోతో స్టార్ హీరోయిన్ అఫైర్.. సంచలనం సృష్టించిన ప్రేమ వ్యవహారం..!
లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ నటిగా మాత్రమే కాక సింగర్ గా కూడా తనకంటూ.. ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శృతిహాసన్ తన సినిమాల వల్ల మాత్రమే కాక.. ప్రేమ వ్యవహారాల వల్ల కూడా చాలాసార్లు వార్తల్లో నిలిచింది.
మైఖేల్ కోర్స్లే అనే ఒక ఫారెనర్ తో.. చాలా కాలం శృతిహాసన్ ప్రేమలో ఉంది. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యేవి. ఎలాంటి విషయం గురించి అయినా బోల్డ్ గా మాట్లాడే శృతిహాసన్.. పెళ్లి గురించి కూడా చాలానే కామెంట్లు చేసింది. అప్పుడే తనకి పెళ్లి చేసుకోవాలని లేదు అని.. నచ్చిన అబ్బాయి దొరికితే మాత్రం వివాహానికి ఏముంది.. తల్లిని అవుతాను అంటూ అప్పట్లో శృతిహాసన్ చేసిన కామెంట్స్. ఈ హీరోయిన్ చెప్పిన ఈ మాటలు అప్పట్లో దుమారం లేపాయి.
మైకేల్ తో బ్రేకప్ అయ్యాక శృతిహాసన్ శాంతను హజారికా అనే ఒక డూడిల్ ఆర్టిస్ట్ తో.. చాలాకాలం డేటింగ్ చేసింది. ఈ జంట ముంబైలో కాపురం కూడా పెట్టేసింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల.. ఈ జంట విడిపోయింది. దాదాపు పెళ్లి దాకా వెళ్ళిన ఈ జంట మధ్య బ్రేకప్ అయిపోయింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. శృతిహాసన్ కి ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోతో ఎఫైర్ ఉండేది.
ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో శృతిహాసన్ ఎఫైర్ పెట్టుకుంది అని.. సింగర్ సుచిత్ర కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రీ మూవీలో.. కలిసి నటించిన ఈ జంట షూటింగ్ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేశారని.. అప్పటికే ధనుష్ కి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని సుచిత్ర సంచలనా వ్యాఖ్యలు చేసింది. వాళ్లకి సంబంధించిన వ్యక్తిగత వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయి అంటూ.. సుచిత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ కామెంట్లు చేసింది.
ధనుష్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే శృతిహాసన్ తో ఎఫెక్ట్ గురించి తెలుసుకున్న ఐశ్వర్య.. శృతిని కలిసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అలా ఈ జంట విడిపోయింది అని.. లేకపోతే అప్పట్లో పెళ్లి కూడా చేసుకోవాలని ప్లాన్ లు.. చేసుకున్నారని తెలుస్తోంది. ఇక త్రీ సినిమా తర్వాత ధనుష్, శృతిహాసన్ మళ్ళీ కలిసి నటించలేదు.