Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే గరుడ వాహన సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో మిగతా రోజులలో ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామికి అలంకరిస్తారు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ మంగళవారం రాత్రి శ్రీవారి గరుడ వాహనసేవ నిర్వహించారు. తిరుమల మాడ వీధులలో స్వామివారిని ఉరేగించారు.
Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!
పౌర్ణమిరోజు గరుడ వాహన సేవలో భాగంగా శ్రీవారిని తిరుమల తిరుపతి దేవస్థానం పూజారులు, అర్చకులు, సిబ్బంది కొందరు మాత్రమే పాల్గొని మాడ వీధులలో ఏప్రిల్ 27న రాత్రి శ్రీవారిని ఊరేగించారు.
పురాణాల ప్రకారం, గరుగ వాహనంపై శ్రీవారి సేవలను 108 దేశాలలో భక్తిగా కొలుస్తారని ప్రసిద్ధి. గరుడవాహన సేవ రోజున ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి భక్తులను ఆశీర్వదిస్తారు. భక్తులు ఈ సేవలో పాల్గొనాలని ఆశగా ఎదురుచూస్తుంటారు.
Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే
పురాణాలలో గరుడ పురాణం విశిష్టతను తెలుసుకునేందుకు భక్తులు శ్రద్ధ చూపుతారు. ఆయన రెక్కలు విజయానికి సంకేతంగా భావిస్తారు.
టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ ఇతర ఉన్నతాధికారులు గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. పౌర్ణమి గరుడ సేవ ఫొటోలు భక్తుల కోసం ఇక్కడ అందిస్తున్నాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook