Tirumala: ఎంతకు తెగించార్రా..?.. తిరుమలలో బైట పడ్డ మరో షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?

Sat, 23 Nov 2024-4:50 pm,

గత కొన్నిరోజులుగా తిరుమల ఏదో ఒక అంశంతో తరచుగా వార్తలలో ఉంటుంది. మెయిన్ గా తిరుమల లడ్డు కల్తీ అంశం మాత్రం కోట్లాది శ్రీవారి భక్తులను కలవరపెట్టిందని చెప్పుకొవచ్చు. ఈ అంశం రాజకీయంగా కూడా కాకరేపేది మారింది. దీనిపై కూటమి సర్కారు సీరియస్ గా చర్యలు తీసుకుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పాలనలో మరింత స్పీడు ను పెంచారు. ఆయన గతంలో ప్రభుత్వాలు తిరుమల ప్రతిష్టను భంగంకలిగే విధంగా చేసిన పనుల్ని ప్రజల ముందుంచుతున్నారు.  

అదే విధంగా టీటీడీ హిందువులు ఉండాలని, అన్యమతస్తులు ఇతర డిపార్ట్ మెంట్ లకు బదిలీపై వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతే కాకుండా.. తిరుమల పవిత్రను కాపాడేలా.. సామాన్యుడికి శ్రీవారి దర్శనం తక్కువ సమయంలో అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు

ఈ నేపథ్యంలో తాజాగా.. తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా టీటీడీ విడుదల చేసే వీఐపీ బ్రేక్ టిక్కెట్లలో అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తొంది.

ఈ నేపథ్యంలో దీనిపై నిఘాపెట్టిన అధికారులు.. ఒకే రోజు ఓ శాశ్వత ఉద్యోగికి  18 వీఐపీ బ్రేక్ టిక్కెట్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. అదే విధంగా.. మళ్లీ అదే కార్పొరేషన్ ఉద్యోగికి మరో రోజు 2 టిక్కెట్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు ఉద్యోగి లీవ్ లో ఉన్నప్పటికీ ఆయన ఐడి కార్డు పై రెండు టిక్కెట్లు మంజూరు చేసినట్లు గుర్తించారు.  

ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఘటనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. దీనిపై విజిలెన్స్ అధికారులు, టీటీడీ సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఒక నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం కలకలంగా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link