Tirumala Darshan: తిరుమల భక్తులకు శుభవార్త.. టికెట్ లేకుండా కేవలం గంటలోనే దర్శనం.. ఎలాగంటే..?
ఇలా గంటల తరబడి క్యూలైన్లో నిలబడడం వల్ల చాలా మంది వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారు , చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరందరి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్యమైన ఆలోచనతో ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అందులో భాగంగానే ఏడాదిలోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా.. అది కూడా ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తోంది అని చెప్పవచ్చు. దీంతో ఏడాదిలోపు పిల్లలతో వారి తల్లిదండ్రులు స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. అయితే ఇలా దర్శనం కోసం కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
సంవత్సరంలోపు వయసున్న పిల్లలకు..ఉచిత దర్శనానికి సంబంధించి కచ్చితంగా ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్..తీసుకెళ్లాల్సి ఉంటుందట.ఒకవేళ బర్త్ సర్టిఫికెట్ లేని పక్షంలో హాస్పిటల్ నుంచి ఇచ్చే డిశ్చార్జ్ సమ్మరీ అయినా తీసుకెళ్లాలి. అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కచ్చితంగా ఉండాలి. ఉదయం 8:30 గంటలకు నుండి 10:30 గంటల వరకు , మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు.
ఇకపోతే సంవత్సరం లోపు ఉండే పాపా లేదా బాబు అలాగే వారి తల్లిదండ్రులు వారితోపాటు 12 సంవత్సరాల లోపు ఉండే పాప లేదా బాబును మాత్రమే ఉచిత దర్శనానికి అనుమతి ఇస్తారు. మిగిలిన వారి కుటుంబ సభ్యులకు ఉచిత దర్శనానికి అనుమతి ఉండదు. అలాగే వృద్ధులు 65 సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఈ సౌకర్యం కల్పించబడింది. మానసిక, శారీరక ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ సేవలను అందుకోవచ్చు.
300 రూపాయల ప్రత్యేక దర్శనం, శ్రీ వాణి ట్రస్ట్ దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనం, దివ్యదర్శనం ఇలా భక్తులు స్వామి సేవలో పాల్గొనే అవకాశాలను కూడా టీటీడీ కల్పిస్తోంది. ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లలు వారి తల్లిదండ్రులకు కూడా ఉచితంగా ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తోంది.