Tollywood Most Eligible Bachelors 2: మీడియం రేంజ్ టాలీవుడ్ హీరోల్లో పెళ్లి కానీ ప్రసాదులు వీళ్లే..
రాజ్ తరుణ్.. రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోగా రేసులో వెనకబడ్డాడు. కానీ ఈ యేడాది నాగార్జున, అల్లరి నరేష్ హీరోలుగా తెరకెక్కిన 'నా సామిరంగ'లో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈయన వయసు 32 యేళ్లు. మరి ఇతను ఈ యేడాదిలోనైనా తన బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేస్తాడా లేదా అనేది చూడాలి.
సందీప్ కిషన్.. సందీప్ కిషన్ హీరోగా ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం 35 యేళ్లు దాటినా.. ఒంటరి లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. 2024లో అయిన ఇతను బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేస్తాడా లేదా అనేది చూడాలి.
సుశాంత్.. అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన ఇతని వయసు 36 యేళ్లు. ఇతను మెయిన్ హీరోకు తక్కువ. సైడ్ హీరోకు ఎక్కువ అన్నట్టు తయారైంది పరిస్ధితి. మరి 2024లో ఇతను పప్పన్నం తినిపిస్తాడా లేదా అనేది చూడాలి.
నారా రోహిత్.. నారా రోహిత్.. వయసు 40కు దగ్గర పడుతున్న ఇప్పటికీ సింగిల్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. మరి 2024లో అయిన ఇతను పెళ్లి పీఠలు ఎక్కుతాడా ? లేదా అనేది చూడాలి.
బెల్లంకొండ శ్రీనివాస్..
బెల్లంకొండ శ్రీనివాస్ .. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా.. టాప్ హీరోయిన్ ఉండేలా చేసుకునే హీరోల్లో బెల్లంకొండ ముందు వరుసలో ఉంటాడు. ఇతను వయసు 30 యేళ్లు. మరి 2024లో ఇతను ఓ ఇంటివాడు అవుతాడా ? లేదా అనేది చూడాలి.
అల్లు శిరీష్.. వెనకాల కొండంత మెగా ఫ్యామిలీ అండ ఉన్న ఇప్పటికీ హీరోగా స్ట్రగుల్ అవుతున్నాడు. వయసు 35 యేళ్లు దాటుతున్న ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. మరి ఈ యేడాదైన ఇతను ఫ్యామిలీ మ్యాన్ అవుతాడా లేదా అనేది చూడాలి.
తరుణ్.. మిలీనియం కొత్తలో యూత్ హీరోగా ఓ ఊపు ఊపిన తరుణ్ గుర్తున్నాడా.. ఈయన వయసు ప్రస్తుతం 42 యేళ్లు. ఒకపుడు వరుస సక్సెస్‌లు అందుకొని టాప్ హీరో లీగ్‌లో ఉన్న ఇతను సడెన్‌గా రేసులో వెనకబడ్డాడు. ఇప్పటికే సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తోన్న ఇతను 2024లో అయిన తన బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెడతాడా లేదా అనేది చూడాలి.