Tollywood Day 1 WW Top Gross Movies: ‘పుష్ప 2’ సహా ఫస్ట్ డే టాలీవుడ్ హైయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రాలు..
‘పుష్ప 2’ ది రూల్ మూవీ 2024లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. కేవలం పుష్ప 2 రికార్డులు తెలుగుకు మాత్రమే కాదు.. హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో మారు మోగిపోతుంది. ఇప్పటికే హిందీలో ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డులను క్రియేట్ చేసింది. దాంతో పాటు మన దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా పలు రికార్డులను తన పేరిట పలు రికార్డులను వేస్తూ రప రప వెళ్లిపోతుంది.
1.పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 166.01 కోట్ల షేర్ (రూ. 294 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ పుష్ప 2 .. నాన్ రాజమౌళి హీరోగా పలు రికార్డులను క్రియేట్ చేయడం విశేషం. టాప్ 1లో నిలిచింది.
2.RRR (రౌద్రం రణం రుధిరం) రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజు రూ. 135 కోట్ల షేర్ (రూ. 235 కోట్ల గ్రాస్) రాబట్టి పుష్ప 2 వచ్చే వరకు టాప్ ప్లేస్ నిలిచిది. తాజాగా పుష్ప 2తో రెండో ప్లేస్ లో నిలిచింది.
3.బాహుబలి 2..
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బాహుబలి 2’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగారూ. 123 కోట్ల షేర్ ( రూ. 215 కోట్ల గ్రాస్ ) రాబట్టి తాజా ర్యాకింగ్స్ లో టాప్ 3లో నిలిచింది.
4. కల్కి 2898 AD..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100.01 కోట్ల షేర్ (రూ. 183.20 గ్రాస్)తో మూడో ప్లేస్ నుంచి టాప్ 4లోకి వెళ్లింది.
5. దేవర పార్ట్ 1.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రం ఫస్ట్ డే దాదాపు (రూ. 100 కోట్ల షేర్) రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తాజాగా ర్యాంకింగ్స్ లో టాప్ 5లో నిలిచింది.
6. సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ సినిమా ఫస్ట్ డే 97.49 కోట్ల షేర్ (రూ. 167 కోట్ల గ్రాస్)కలెక్షన్ తో టాప్ 6లో నిలిచింది.
7.ఆదిపురుష్.. ప్రభాస్.. శ్రీరామచంద్రుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా మొదటి రోజు రూ. 70.11 కోట్ల షేర్ (రూ. 137 కోట్ల)గ్రాస్ తో వరల్డ్ వైడ్ గా టాప్ 7లో ఉంది.
8.సాహో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.64 కోట్ల షేర్ (రూ.126 గ్రాస్) వసూల్లతో 8వ స్థానంలో నిలిచింది.
9. సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో యాక్ట్ చేసిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ మూవీ తొలి రోజు రూ. 53.72 కోట్ల షేర్ (రూ. 85 కోట్ల గ్రాస్) రాబట్టి టాప్ 9లో నిలిచింది.
10. గుంటూరు కారం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ ఫస్ట్ డే తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.03 కోట్ల షేర్ (రూ. 99 కోట్ల) రాబట్టి 10 ప్లేస్ లో నిలిచింది.
11.బాహుబలి..
ీటరాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి -1’. ఈ సినిమా తొలి రోజు రూ. 46 కోట్ల షేర్ (రూ. 73 కోట్ల గ్రాస్) వసూళ్లతో టాప్ 11లో నిలిచింది.