Toothpaste: టూత్‌పేస్ట్‌తో బంగారు ఆభరణాలను తళతళ మెరిపించవచ్చు
Toothpaste Shines Household Items: దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పేస్ట్ వినియోగిస్తుంటాం. అదే పేస్టును ఇంటి వస్తువులను తళతళ మెరిసేలా కూడా చేయవచ్చు.
Toothpaste Tips: టూత్‌పేస్ట్ దంతాలను శుభ్రం చేస్తాయి. దంతాలను కాకుండా మన ఇంటిని శుభ్రం చేయడంలో కూడా టూత్‌పేస్టు కూడా మేలు చేస్తుంది. టూత్‌పేస్ట్‌తో ఇంట్లోని వస్తువులను ఇలా శుభ్రం చేసుకోవచ్చు.
Toothpaste Tips: బట్టలు లేదా ఫర్నిచర్‌పై మరకలను తొలగించడానికి టూత్ పేస్టును ఉపయోగించవచ్చు. మరకలపై తెల్లటి టూత్‌పేస్ట్‌ను పూయండి. అనంతరం బ్రష్‌తో స్క్రబ్ చేస్తే మరక మాయమవుతుంది.
Toothpaste Tips: తుప్పు పట్టిన వస్తువులను తళతళ కనిపించేలా చేయడంలో పేస్ట్ సహాయం చేస్తుంది. తుప్పు పట్టిన ప్రదేశాలలో పేస్ట్‌ను పూసి స్క్రబ్ చేస్తే తప్పు వదులుతుంది.
Toothpaste Tips: బంగారు లేదా వెండి ఆభరణాలు మెరవడానికి కూడా పేస్ట్ ఉపయోగ పడుతుంది. ఆభరణాలపై పేస్ట్ వేసి స్క్రబ్ చేసిన అనంతరం నీళ్లతో కడిగేస్తే చాలు.
Toothpaste Tips: బూట్లు మెరవడానికి పేస్ట్‌ను వాడవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తెల్లటి టూత్ పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు కలిపి స్క్రబ్ చేయడం వల్ల తెల్లటి బూట్లపై మరకలు, బురద తొలగిపోతుంది.
Toothpaste Tips: నిత్యం వినియోగించే బాత్రూమ్ సింక్ కోసం టూత్‌పేస్టు వాడవచ్చు. టూత్‌పేస్ట్‌ను సింక్‌కు పూసి తడి స్పాంజ్‌తో లేదా పేపర్ టవల్‌తో స్క్రబ్బింగ్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
Toothpaste Tips: పియానోను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. కాటన్ బట్టను కొంచెం టూత్‌పేస్ట్‌తో నానబెట్టి ప్రతి కీని స్క్రబ్ చేయాలి. అనంతరం శుభ్రమైన గుడ్డతో తుడిస్తే పియానో మెరుస్తుంది.