EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EFPO) అందరు ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలను కల్పిస్తోంది. ప్రతీ ఉద్యోగి ఖాతా నుంచి కొద్ది మొత్తం ప్రతీ నెల పీఎఫ్ ఎకౌంట్‌లో భద్రపరుస్తారు. పదవి విరమణ సమయంలో కలిగే లాభాలతో పాటు పావిడెంట్ ఫండ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ ప్రయోజనాలు ఏంటంటే...
Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు యాక్టివ్‌గా లేకున్నా వాటికి వడ్డీ చెల్లిస్తుంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. 2016లో జరిగిన సవరింపు తరువాత ఎవరి ఎకౌంట్ అయినా మూడు సంవత్సరాల తరువాత కూడా యాక్టివ్‌గా లేకున్నా వాటికి వడ్డీ వస్తుంది.
Also Read | Women Empowerment: మహిళలకు గ్యారంటీ లేకుండా పదిలక్షల రుణం ఇచ్చే బ్యాంకు ఇదే!
ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం వారి బేసిక్ సాలరీ, డియర్నెస్ అలవెన్స్ (DA) నుంచి కట్ చేసి పీఎఫ్ ఖతాలో జమ చేస్తారు. అదే సమయంలో సంస్థలు కూడా 12 శాతం ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో జమచేస్తాయి. వీటిని ఉద్యోగి పదవి విరమణ తరువాత వినియోగించుకోగలడని ఇలా చేస్తారు.
Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది
మీ ప్రావిడెంట్ ఖాతా యాక్టివ్ అవ్వగానే మీకు బీమా సదుపాయం కూడా వచ్చేస్తుంది. మీకు ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్‌లో భాగంగా మీకు రూ.6లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ డబ్బు కోసం నామినీ ఎంపిక కూడా జరుగుతుంది.
ట్యాక్స్ మనీ సేవ్ చేయాలి అంటే మీకు ప్రావిడెంట్ ఫండ్ చాలా మంచి అప్షన్. ఇందులో మీరు జీతం డబ్బుల్లో సెక్షన్ 80 సీ ప్రకారం 12 శాతం సేవ్ చేసుకోవచ్చు.
Also Read | Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్