Top 5 Camera Smarphones: వెడ్డింగ్ ఫోటోగ్రఫీకు సైతం పనిచేసే టాప్ 5 కెమేరా స్మార్ట్‌ఫోన్లు ఇవే, ధర, ఇతర ఫీచర్లు

Mon, 21 Aug 2023-6:26 pm,

Xiaomi 13 Pro

Xiaomi 13 Pro లో మూడు కెమేరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా. తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో లభిస్తోంది. దీని ధర 79,999 రూపాయలు.

Vivo X90 Pro

Vivo X90 Pro లో ZEISS సహకారంతో అద్భుతమైన కెమేరా ఉంది. ప్రైమరీ కెమేరా తక్కువ లైట్‌లో కూడా ఫోటోలు క్లిక్ చేస్తుంది. ఈ ఫోన్ కూల్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ధర 84,999 రూపాయలు.

Vivo V27 Pro

Vivo V27 Pro ఈ ఫోన్ సూపర్ స్లిమ్ అండ్ బెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రైమరీ కెమేరా చాలా శక్తివంతమైంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర 37,999 రూపాయలు.

Samsung Galaxy S23 Ultra

Samsung Galaxy S23 Ultra ఇప్పటి వరకూ అద్భుతమైన కెమేరా కలిగిన స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ 2 చిప్ ద్వారా అనుసంధానితమైంది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం ప్రత్యేకత. ఇందులో ఎస్ పెన్ కూడా ఉంది. ఇది రైటింగ్, డ్రాయింగ్‌కు పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 1,24,999 రూపాయలు.

OPPO Reno 10 Pro Plus

OPPO Reno 10 Pro Plus లో హై ఎండ్ కెమేరా ఉంది. ఎక్కువ జూమ్ చేసినా సరే ఫోటో క్వాలిటీ దెబ్బతినదు. ఈ ఫోనా్  ప్రారంభధర 39,999 రూపాయలు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link