BellyFat: పొట్ట కింద కొవ్వుపేరుకుపోవడానికి ఇవే కారణాలంటా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?
ముఖ్యంగా ప్రస్తుతం జనరేషన్ బెల్లీఫ్యాట్ లో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ వల్ల తమ పనులు తాము కూడా చేసుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెల్లీఫ్యాట్ కు ముఖ్యంగా కొన్నికారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గంటల కొద్ది ఒకే పోజిషన్ లో కూర్చువడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య వస్తుంది. ఎంత బిజీగా ఉన్న కూడా ఒక రెండు గంటలకు ఒకసారి లేచీ మరల వర్క్ మీద కూర్చోవాలి. గంటలు తరబడి ఒకేచోట కూర్చోకూడదు.
ఫుడ్ అలవాట్లను మార్చుకొవాలి. టైమ్ కు టిఫిన్,లంచ్ లను, స్నాక్స్, డిన్నర్ ఇలా డిసిప్లేన్ తో ఉండాలి. ఇష్టమున్నట్లు తిన్న కూడా లావెక్కిపోతుంటారు. కొందరు మంచి తినాల్సిన ఫుడ్ లను స్కిప్ చేస్తుంటారు. దీని వల్ల కూడా అనేక సమస్యలు వస్తుంటాయి.
అదే పనిగా బైట దొరికే జంక్ ఫుల్ లను తినడం మానుకోవాలి. జంక్ ఫుడ్ తినేవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయిలీ ఫుడ్ లను కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజు క్రమంతప్పకుండా శరీరానికి కాస్తంత శ్రమ ఇవ్వాలి. ప్రతిరోజు జాగింగ్, వాకింగ్, రన్నింగ్ ల వంటివి చేయాలి.
తీసుకునేఆహారంలో పోషక పదార్థాలు ఉండేలా చేసుకొవాలి. అదే విధంగా.. ఫ్రూట్స్ లను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా మొలకెత్తె ధాన్యాలను రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య అనేది క్రమంగా తగ్గిపోతుంది.
కూల్ డ్రింక్ లు ఎక్కువగా తాగేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకు బైటదొరికే కూల్ డ్రింక్స్ లను ఎక్కువగా తాగడం అవాయిడ్ చేయాలి.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)