కోవిడ్-19 వ్యాక్సిన్ సంగతి దేవుడెరుగు.. ముందు కరోనా Second Wave నుంచి తప్పించుకోండి!

Fri, 27 Nov 2020-2:48 am,

కరోనాకు వ్యాక్సిన్ రానంత వరకు మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన ఆహారంలో విటమిన్ సీ అధికంగా ఉన్న అమ్లా, నిమ్మకాయ, బత్తాయి, నారింజ లాంటివి తీసుకోవాలి. ప్రతీ రోజు కనీసం రెండు రకాలు పండ్లు తీసుకోవాలి అని పోషకాహర నిపుణులు చెబుతున్నారు.

కరోనావైరస్ ను మన శరీరంలోని రోగశనిరోధక శక్తి పోరాడి ఓడించగలదు.ఇందులో భాగంగా మీరు ప్రతీ రోజు వేడి పాలలో కొంచెం పసుపు కలిపి తాగడండి. దీని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రభావం భారత దేశంలో కూడా కనిపిస్తోంది. ఈసారి మరింత ప్రమాదకరంగా మారుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Covid-19 Second Wave | మళ్లీ వచ్చేసింది కరోనా అని అనడానికి లేదు. ఎందుకంటే కరోనావైరస్ అసలు మన మధ్యలోంచి ఇప్పటి వరకు వెళ్లిపోలేదు. మరి సెకండ్ వేవ్ ఏంటి అంటారా ? కాలాన్ని బట్టి వైరస్ రూపాంతరం అంటే మ్యూటేట్ అయ్యే వేగం పెరగుతుంది. చలికాలం కోవిడ్-19 వేగం మరింగా పెరుగుతోంది.

కోవిడ్ -19 ఇంకా అంతం అవలేదు. వ్యాక్సిన్ ఇంకా రాలేదు. అయినా చాలా మంది ఎలాంటలి సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా తిరుగుతున్నారు. దీని వల్ల సెకండ్ వేవ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. అందుకే అవసరం అయితేనే బయటికి వెళ్లండి. భౌతిక దూరం పాటించండి.

లాక్ డౌన్ సమయంలో మనం పాటించిన నియమాలు అనేవి ఇప్పుడూ పాటించాలి. ఎందుకంటే నాటి పరిస్థితి నేడూ ఉంది. వస్తువులను శుభ్రం చేసుకోవడం, బయటికి వెళ్లివచ్చాక స్నాం చేయడం, ఎప్పటికప్పుడు చేతులు వాష్ చేసుకోవడం, దగ్గర ఒక శానిటైజర్ ఎప్పుడూ ఉంచుకోవడం చాలా అవసరం. 

కరోనావైరస్ మహహ్మారి నుంచి తప్పించుకోవడంలో మాస్కుల పాత్ర చాలా  కీలకమైంది. ఎందుకంటే సుమారు 50 నుంచి 80 శాతం సంక్రమణలను అదుపు చేయవచ్చు. 

కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే సంగతి దేవుడికే తెలుసు. కానీ ముందు సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలి. ఎందుకంటే సెకండ్ వేవ్ లో వైరస్ చాలా వేగంగా రూపాంతరం చెంతుదోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link