Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ జీతం, సౌకర్యాలు ఏమిటో తెలుసా?

Wed, 06 Nov 2024-2:41 pm,

మళ్లీ ట్రంప్: హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డొనల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

జీత భత్యాలు: అమెరికా అధ్యక్షుడి జీత భత్యాలు, సౌకర్యాలు ఏమేమి ఉంటాయనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఏడాదికి ఎంత: అమెరికా అధ్యక్షుడి ఏడాదికి 4 లక్షల డాలర్లు వేతనంగా చెల్లిస్తారు. సుమారు రూ.3.36 కోట్లు జీతంగా ఉంటుంది.

ఖర్చుల కోసం: అధికారిక విధుల నిర్వహణ కోసం చేసే ఖర్చు కింద 50 వేల డాలర్లు (దాదాపు రూ.42 లక్షలు) అందిస్తారు.

ఇతర ఖర్చులు: అమెరికా అధ్యక్షుడు నివసించే అధికారిక గృహం వైట్‌ హౌస్‌లో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు.. వైట్‌హౌస్‌లో మరమ్మతులు, తన అభిరుచికి అనుగుణంగా మార్చుకునేందుకు లక్ష డాలర్లు (రూ.84 లక్షలు) కేటాయిస్తారు. 

తొలి జీతం: అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్టన్‌ జీతం 2 వేల డాలర్లు ఉండేది. చివరిసారిగా అధ్యక్షుడి జీతం పెరిగింది 2001లో. అప్పటి నుంచి ఇప్పటివరకు అధ్యక్షుడి జీతం పెరగలేదు.

అన్నీ రహాస్యం: అమెరికా అధ్యక్షుడి భద్రత, సౌకర్యాలు, నిధులు వంటి విషయాలకు సంబంధించిన వివరాలు భద్రతా కారణా రీత్యా బయటకు రావు.

మాజీ అధ్యక్షుడికి కూడా భారీ వేతనం ఉంటుంది. మాజీ కాబోతున్న జో బైడెన్ కు 2 లక్షల డాలర్లు జీతంగా చెల్లిస్తారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link